Rashtriya Ispat Nigam Limited

RINL
భారత ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ జూనియర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 
●పోస్టులు: జూనియర్ ట్రెయినీ -మొత్తం ఖాళీలు: 664 మెకానికల్-344, ఎలక్ట్రికల్-203, మెటలర్జీ-98, ఇన్‌స్ట్రుమెంటేషన్-19 ఖాళీలు ఉన్నాయి.
●వయస్సు: 2018, జూలై 1 నాటికి జనరల్ అభ్యర్థులకు 27 ఏండ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్)-30, ఎస్సీ/ఎస్టీలకు 32 ఏండ్లు.
●అర్హతలు: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో కనీసం 60 శాతం మార్కులతో ఫుల్‌టైం ఐటీఐ/ డిప్లొమా ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు 50 శాతం మార్కులు వస్తే సరిపోతుంది.
◆శిక్షణ & స్టయిఫండ్: ఎంపికైన అభ్యర్థులకు 24 నెలలు శిక్షణనిస్తారు. శిక్షణ సమయంలో మొదటి ఏడాది నెలకు రూ. 10,700/-, రెండో ఏడాది నెలకు రూ. 12,200/- స్టయిఫండ్‌గా చెల్లిస్తారు. -విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారికి టెక్నీషియన్ లేదా తత్సమాన హోదాలో పోస్టింగ్ ఇస్తారు. -పేస్కేల్: రూ. 16,800-24,110/- (ఏడాదికి సుమారుగా ప్రారంభంలో 4.84 లక్షల జీతం వస్తుంది).
●దరఖాస్తు: ఆన్‌లైన్‌లో -చివరితేదీ: సెప్టెంబర్ 25 
●ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.300/- ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు ఎటువంటి ఫీజు లేదు. -ఫీజు చెల్లించడానికి చివరితేదీ: సెప్టెంబర్ 26 -నోట్: 3/2017 నోటిఫికేషన్ ద్వారా 2018, మేలో పరీక్ష రాసినవారు దరఖాస్తు చేసుకోనసరం లేదు.
●వెబ్‌సైట్: www.vizagsteel.com