●ప్రిలిమ్స్‌లో ఎంపికైన అభ్యర్థులు పీఎంటీ, పీఈటీ కోసం పార్ట్-2 దరఖాస్తును నింపి, అక్టోబర్ 29 సోమవారం ఉదయం 10 గంటల నుంచి నవంబర్ 18 అర్ధరాత్రిలోగా సమర్పించాలని సూచించారు. పీఎంటీ, పీఈటీలు రాష్ట్రవ్యాప్తంగా 13 చోట్ల నిర్వహించనున్నట్టు తెలిపారు. డిసెంబర్ 17 ప్రారంభమయ్యే ఈవెంట్స్‌ను 35 నుంచి 40 పనిదినాల్లో పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించినట్టు వెల్లడించారు.
●పార్ట్-2 దరఖాస్తు నింపడంలో జాగ్రత్త పీఎంటీ, పీఈటీలకు హాజరయ్యే అభ్యర్థులు పార్ట్-2 దరఖాస్తును నింపే సమయంలో తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీనివాసరావు సూచించారు. ఏయే తేదీల్లో పీఎంటీ, పీఈటీలు ఉన్నవో వెబ్‌సైట్‌లో త్వరలోనే వెల్లడిస్తామని, ఆ రోజు అడ్మిట్‌కార్డు తీసుకురావాలని, బయోమెట్రిక్‌లో వేలిముద్రలు సరిపోలితేనే అనుమతిస్తామని చైర్మన్ స్పష్టంచేశారు.
Filling-up Part-II Applications, Uploading Documents from 29th October to 18th November
CLICK HERE https://www.tslprb.in