హైదరాబాద్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలో పనిచేస్తున్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అకౌంట్స్ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ECIL
మొత్తం ఖాళీలు: 30
●అడిషనల్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)-1, ఎస్‌డీజీఎం (పర్చేజ్-1, న్యూక్లియర్-2), పర్సనల్ మేనేజర్-3, పర్చేజ్ మేనేజర్-3, పర్చేజ్ ఆఫీసర్-5, పర్సనల్ ఆఫీసర్-5, అకౌంట్స్ ఆఫీసర్-10
●అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, పీజీ, డిప్లొమా, సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
●వయస్సు: 2018 ఆగస్టు 31 నాటికి 28 ఏండ్లకు మించరాదు.
●పే స్కేల్: రూ. 57,115/- (పోస్టులను బట్టి వేర్వేరు పే స్కేల్స్ ఉన్నాయి)
●ఎంపిక: రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
●దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
●దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 15
●హార్డ్‌కాపీలకు చివరితేదీ: అక్టోబర్ 22
●వెబ్‌సైట్: www.ecil.co.in