HPCL NOTIFICATION FOR 122 POST'S

హెచ్‌పీసీఎల్‌లో 122 ఉద్యోగాలు,
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ముంబై రిఫైనరీలో నాన్ మేనేజ్‌మెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

పోస్టుల వివరాలు:
◆అసిస్టెంట్ ప్రాసెస్ టెక్నీషియన్
-ఖాళీలు: 67
-అర్హతలు: కనీసం 60% మార్కులతో బీఎస్సీ (కెమిస్ట్రీ) లేదా కెమికల్ ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.

◆అసిస్టెంట్ బాయిలర్ టెక్నీషియన్
-ఖాళీలు: 6
-అర్హతలు: పదోతరగతి లేదా తత్సమానకోర్సుతోపాటు ఫస్ట్‌క్లాస్‌లో బాయిలర్ అటెండెంట్ కాంపిటెన్సీ సర్టిఫికెట్ ఉండాలి.

◆అసిస్టెంట్ ల్యాబొరేటరీ అనలిస్ట్
-ఖాళీలు: 7
-అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో బీఎస్సీ కెమిస్ట్రీ ఉత్తీర్ణత. కెమిస్ట్రీ సబ్జెక్టులో తప్పనిసరిగా 60 శాతం మార్కులు వచ్చి ఉండాలి.

◆అసిస్టెంట్ మెయింటెనెన్స్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్)
-ఖాళీలు: 7
-అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా.

◆అసిస్టెంట్ మెయింటెనెన్స్ టెక్నీషియన్ (ఇన్‌స్ట్రుమెంటేషన్)
-ఖాళీలు:7
-అర్హతలు: 60 శాతం మార్కులతో ఎలక్ట్రికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా.

◆అసిస్టెంట్ మెయింటెనెన్స్ టెక్నీషియన్ (మెకానికల్)
-ఖాళీలు: 9
-అర్హతలు: 60 శాతం మార్కులతో మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా.

◆ఫైర్ ఆపరేటర్
-ఖాళీలు: 19
-అర్హతలు: ఇంటర్ (సైన్స్)తోపాటు బేసిక్ ఫైర్ ఫైటింగ్ కోర్సులో సర్టిఫికెట్ కలిగి ఉండాలి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
-వయస్సు: పై అన్ని పోస్టులకు 2018, అక్టోబర్ 31 నాటికి 18-25 ఏండ్ల మధ్య ఉండాలి.

●ఎంపిక విధానం: అర్హత కలిగిన అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) నిర్వహిస్తారు. దీనిలో జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, టెక్నికల్/ప్రొఫెషనల్ నాలెడ్జ్‌పై ప్రశ్నలు ఇస్తారు.
●సీటీసీ: నెలకు రూ. 47,800/-
●దరఖాస్తు: ఆన్‌లైన్‌లో n చివరితేదీ: అక్టోబర్ 31

వెబ్‌సైట్: http://hindustanpetroleum.com