నావికాదళంలో 3400 ఉద్యోగాల ప్రకటన

నావికాదళంలో 3400 ఉద్యోగాలు,
ఇంటర్, పదోతరగతి ఉత్తీర్ణులకు అవకాశం
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, పీఎఫ్‌టీ ద్వారా ఎంపిక జరుగుతుంది

భారత నావికాదళ ఖాళీలవివరాలు

1.సెయిలర్స్
2.ఆర్టిఫైజర్ సెయిలర్స్
3.మేట్రిక్ సెయిలర్స్
పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

●పోస్టు: సెయిలర్ (సీనియర్ సెకండరీ రిక్రూట్-ఆగస్టు 2019) మొత్తం ఖాళీలు: 2500
●అర్హతలు: ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌తోపాటు కెమిస్ట్రీ లేదా బయాలజీ / కంప్యూటర్‌సైన్స్‌తో ఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
●వయస్సు: అభ్యర్థులు 1998, ఆగస్టు 1 నుంచి 2002, జూలై 31 మధ్య జన్మించి ఉండాలి.
●శిక్షణ: ఆగస్టు 2019లో ప్రారంభమవుతుంది. 22 వారాల బేసిక్ ట్రెయినింగ్‌ను ఐఎన్‌ఎస్ చిల్కాలో ఇస్తారు. అనంతరం వేర్వేరు నేవల్ ట్రెయినింగ్ సెంటర్లలో శిక్షణ ఇస్తారు.
●కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నుంచి సుమారు 10 వేల మందిని పీఎఫ్‌టీకి ఎంపికచేస్తారు.

ఆర్టిఫైజర్ అప్రెంటిస్
●పోస్టు: సెయిలర్స్ ఫర్ ఆర్టిఫైజర్ అప్రెంటిస్ (ఆగస్టు-2019 మొత్తం ఖాళీలు: 500
●అర్హతలు: ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతోపాటు కెమిస్ట్రీ/బయాలజీ లేదా కంప్యూటర్ సైన్స్‌ల్లో ఏదైనా ఒక సబ్జెక్టుతో ఉత్తీర్ణత.
●వయస్సు: 1999, ఆగస్టు 1 నుంచి 2002, జూలై 31 మధ్య జన్మించి ఉండాలి.
●శిక్షణ: ఆగస్టు 2019లో శిక్షణ ప్రారంభమవుతుంది. తొమ్మిది వారాలపాటు ఐఎన్‌ఎస్ చిల్కాలో బేసిక్ ట్రెయినింగ్ అనంతరం వివిధ నేవల్ ట్రెయినింగ్ సెంటర్లలో ప్రొఫెషనల్ ట్రెయినింగ్ ఇస్తారు.
నోట్: విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులను మొదట 20 ఏండ్ల కాలపరిమితికి ఉద్యోగంలో నియామక పత్రం ఇస్తారు.
-కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్‌లో ఎక్కువ మార్కులు సాధించిన 1500 మందిని పీఎఫ్‌టీకి, ప్రాథమిక వైద్యపరీక్షలకు ఎంపికచేస్తారు.

పై రెండు పోస్టులకు..
◆పే&అలవెన్స్‌లు: శిక్షణ సమయంలో నెలకు రూ.14,600/-
●శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి లెవల్ 3 పేమ్యాట్రిక్స్ రూ.21,700-69,100+ ఇతర అలవెన్స్‌లు ఇస్తారు.
●పదోన్నతులు: సెయిలర్ నుంచి మాస్టర్ చీఫ్ పెట్టీ ఆఫీసర్-1 (లెవల్ 8) వరకు పదోన్నతి పొందవచ్చు.
●ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, పీఎఫ్‌టీ, వైద్యపరీక్షలు
●కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్: 100 ప్రశ్నలు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు. పరీక్ష సమయం 60 నిమిషాలు.
●ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. పరీక్షలో ఇంగ్లిష్, సైన్స్, మ్యాథ్స్, జీకేపై ప్రశ్నలు ఇస్తారు.
-ప్రశ్నలు ఇంటర్‌స్థాయిలో ఉంటాయి. ప్రతి సెక్షన్‌లో తప్పనిసరిగా అర్హత సాధించాలి. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కులు కోతవిధిస్తారు.

ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ):
●తుది ఎంపికకు ఈ టెస్ట్ తప్పనిసరి. దీనిలో 7 నిమిషాల్లో 1.6 కి.మీ. పరుగెత్తాలి. 20 ఉతక్ బైటక్‌లు, 10 ఫుష్‌అప్స్ చేయాలి.
●శారీరక ప్రమాణాలు: ఎత్తు కనీసం 157 సెం.మీ. ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచించాలి. పై రెండు పరీక్షల్లో అర్హత సాధించినవారికి వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. తుది ఎంపిక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా చేస్తారు.

మెట్రిక్ రిక్రూట్ సెయిలర్స్
●పోస్టు: సెయిలర్స్ ఫర్ మెట్రిక్ రిక్రూట్ (అక్టోబర్ 2019 బ్యాచ్)
●ఈ పోస్టుల్లో చెఫ్, స్టీవార్డ్, హైజినిస్ట్ మూడు విభాగాలు ఉన్నాయి. మొత్తం ఖాళీలు: 400
●అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి మెట్రిక్యులేషన్/పదోతరగతి ఉత్తీర్ణత లేదా తత్సమానకోర్సు ఉత్తీర్ణత.
●శిక్షణ: అక్టోబర్ 2019 నుంచి 15 వారాల బేసిక్ ట్రెయినింగ్‌ను ఐఎన్‌ఎస్ చిల్కాలో ఇస్తారు. అనంతరం నేవీ శిక్షణ కేంద్రాల్లో ప్రొఫెషనల్ ట్రెయినింగ్ ఇస్తారు.
●కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా 1600 మందిని పీఎఫ్‌టీ, ప్రిలిమినరీ మెడికల్ టెస్ట్‌లకు ఎంపికచేస్తారు.

●దరఖాస్తు: ఆన్‌లైన్‌లో డిసెంబర్ 14 నుంచి
●చివరితేదీ: 2018, డిసెంబర్ 30
◆వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in