ఈ నెల 17 నుంచి నిర్వహించనున్న ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు దేహధారుడ్య పరీక్షలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి (టీఎస్‌ఎల్పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో వెల్లడించారు. కొందరు అభ్యర్థులు కోర్టులో కేసులు వేసిన నేపథ్యంలో హైకోర్టు సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వివరించారు. ఈవెంట్స్ నిర్వహణకు సంబంధించి అడ్మిట్‌కార్డుల డౌన్‌లోడ్ ప్రక్రియ ప్రారంభమైందని..ఈ నెల 15 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. నూతన తేదీలను త్వరలో వెల్లడిస్తామని శ్రీనివాసరావు చెప్పారు.