ESIC Telangana Recruitment

హైదరాబాద్‌లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) పరిధిలో పనిచేస్తున్న ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజీల్లో/హాస్పిటల్ & డిస్పెన్సరీల్లో ఖాళీగా ఉన్న పారామెడికల్/నర్సింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 

●మొత్తం ఖాళీల సంఖ్య - 185
●పోస్టు పేరు: పారామెడికల్/నర్సింగ్ స్టాఫ్ ●విభాగాలవారీగా ఖాళీలు:
●స్టాఫ్‌నర్స్-137
●ఈసీజీ టెక్నీషియన్-7
●బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్-4
●ఆక్యుపేషనల్ థెరపిస్ట్-1
●ఫిజియోథెరపిస్ట్-2
●ఫార్మసిస్ట్ (అల్లోపతి)-25
●ఫార్మసిస్ట్ (ఆయుర్వేద)-1
●ఆప్టోమెట్రిస్ట్/ రిఫ్రాక్షనిస్ట్-2
●డెంటల్ హైజనిస్ట్-1
●జూనియర్ ఎంఆర్‌టీ-3
●ఎంఎస్‌డబ్ల్యూ-1
◆అర్హతలు: పగుర్తింపు పొందిన బోర్డు /సంస్థ నుంచి పదో తరగతి, జనరల్ నర్సింగ్ & మిడ్‌వైఫరీలో డిప్లొమా, ఇంటర్ లేదా సైన్స్‌లో డిగ్రీ/సీనియర్ సెకండరీ, బీఫార్మసీ/డీఫార్మసీ, సోషల్ వర్క్‌లో డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత. ఈసీజీ మెషిన్, బ్లడ్ బ్యాంక్ ల్యాబొరేటరీ/ఎంఎల్‌టీ, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, ఫిజియోథెరపిస్ట్, ఆయుర్వేద ఫార్మసీ, ఆప్టోమెట్రీ/డెంటల్ హైజనిస్ట్, సోషల్ వర్క్/హెల్త్ ఎడ్యుకేషన్/ట్రెయినింగ్ సంబంధిత విభాగంలో సర్టిఫికెట్‌తోపాటు అనుభవం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
●పేస్కేల్: స్టాఫ్‌నర్స్ పోస్టులకు రూ. 44,900-1,42,400/-, ఫార్మసిస్టులకు రూ. 29,200-92,300/-. పోస్టులను బట్టి వేర్వేరుగా పేస్కేల్స్ ఉన్నాయి. 
●అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ. 500/-, ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ, ఈఎస్‌ఐ ఎంప్లాయీస్, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళ అభ్యర్థులకు రూ. 250/-
●ఎంపిక: రాతపరీక్ష, కంప్యూటర్ స్కిల్ టెస్ట్ -రాతపరీక్షలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 125 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. దీనిలో టెక్నికల్ ప్రొఫెసనల్ లేదా సబ్జెక్టుకు సంబంధించి (పోస్టులవారీగా) 100 ప్రశ్నలు, ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, అర్థమెటిక్ ఎబిలిటీ నుంచి 25 ప్రశ్నలు వస్తాయి. -రాతపరీక్షను కేవలం 120 నిమిషాల్లో పూర్తిచేయాలి. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కులను తగ్గిస్తారు. -దరఖాస్తు: ఆన్‌లైన్‌లో -చివరితేదీ: 2019 జనవరి 21
వెబ్‌సైట్: www.esic.nic.in