Telangana State JPS results announced

రాష్ట్రంలో 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి సంబంధించి జిల్లాల వారిగా ఎంపిక చేసిన అభ్యర్ధుల హాల్ టికెట్ల నెంబర్లను స్థానిక పత్రికల్లో ప్రచురించేలా చర్యలు తీసుకుంటున్నారు. 
జిల్లా వెబ్సైటు లో కుడా పొందుపరూస్తున్నట్లు తెలిపారు

ఈ నెల 25 లోగా పంచాయతీ జూనియర్ కార్యదర్శుల నియామకపు పత్రాలు జారీ చేయాలని వికాస్ రాజ్ కలెక్టర్లకు సూచించారు. ఉద్యోగాలకు ఎంపికైన అర్హుల సర్టిఫికెట్ల పరిశీలన 3 రోజుల్లోగా పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. ప్రతీ రోజు 300 నుండి 400 మంది అభ్యర్ధుల సర్టిఫికెట్లను పరిశీలించాలన్నారు. దరఖాస్తులో సమర్పించిన విద్యార్హత, వయస్సు, కులం, లోకల్, ప్రత్యేక కేటగిరీల సర్టిఫికెట్లను పరిశీలించాలి.. వీటికి సంబంధించి గైడ్ లైన్స్, చెక్ లిస్ట్ లను పంపుతున్నామని కలెక్టర్లకు తెలిపారు.