TSPSC పరీక్షల షెడ్యూల్‌

టీఎస్‌పీఎస్సీ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది.

శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, హెల్త్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్ డెయిరీ మేనేజర్/మేనేజర్ గ్రేడ్ 2, అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్, ఫీల్డ్ సూపర్‌వైజర్, ప్రాసెసింగ్ సూపర్‌వైజర్, ల్యాబ్ అసిస్టెంట్, బాయిలర్ ఆపరేటర్ గ్రేడ్ 2, ప్లాంట్ ఆపరేటర్, మార్కెటింగ్ అసిస్టెంట్, మార్కెటింగ్ సూపర్‌వైజర్ కొలువులకు సంబంధించిన ప్రవేశ పరీక్షలు డిసెంబర్ 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.

తేదీలవారీగా పరీక్షల వివరాలను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్లో తెలుసుకోవచ్చని సూచించింది. టీఆర్టీ కొలువుల భర్తీలో భాగంగా హిందీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు రెండోవిడుత ధ్రువపత్రాల పరిశీలన డిసెంబర్ 4న చేపట్టనున్నట్టు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. అర్హులైనవారి వివరాలను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్లో పొందుపరిచినట్టు తెలిపింది.