వీఆర్వో(విలేజ్ రెవెన్యూ ఆఫీసర్) పరీక్ష ఫలితాలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. 1:3 చొప్పున ధ్రువపత్రాల పరిశీలనకై అభ్యర్థులను టీఎస్‌పీఎస్సీ ఎంపిక చేసింది. ఎంపికైన అభ్యర్థులకు జనవరి 3వ తేదీ నుంచి ధ్రువపత్రాల పరిశీలన జరపనున్నట్లు పేర్కొంది. ధ్రువపత్రాల పరిశీలనకై పూర్తి షెడ్యూల్ త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిపింది. ఫలితాల కొరకు అభ్యర్థులు కమిషన్ వెబ్‌సైట్ www.tspsc.gov.in.కు లాగిన్ అయి తెలుసుకోవచ్చు.