గెయిల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు

Gail
పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ -మొత్తం ఖాళీలు: 27 ●కెమికల్-15 ఖాళీలు (జనరల్-7, ఓబీసీ-6, ఎస్సీ-1, ఎస్టీ-1)
●ఇన్‌స్ట్రుమెంటేషన్- 12 ఖాళీలు (జనరల్-9, ఓబీసీ-2, ఎస్టీ-1)
●అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 65 శాతం మార్కులతో బీఈ/బీటెక్ (కెమికల్, పెట్రోకెమికల్, కెమికల్ టెక్నాలజీ, పెట్రోకెమికల్ టెక్నాలజీ, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ & ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్) లేదా ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణత. సంబంధిత గేట్ సబ్జెక్టులో అర్హత సాధించాలి. -●వయస్సు: 2019 మార్చి 13 నాటికి 28 ఏండ్లకు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
●ప్రొబేషనరీ పీరియడ్: ఏడాది -పే స్కేల్: శిక్షణ సమయంలో నెలకు రూ. 60,000. ప్రొబేషనరీ పీరియడ్ తర్వాత పే స్కేల్ రూ.60,000 - 1,80,000/- ఉంటుంది. -●ఎంపిక: గేట్ 2019 స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ. గమనిక: ఆన్‌లైన్ గేట్- 2019 రిజిస్ట్రేషన్ నంబర్‌ను తప్పనిసరిగా ఎంటర్ చేయాలి.
●దరఖాస్తు: ఆన్‌లైన్‌లో -చివరితేదీ: 2019 మార్చి 13 -●వెబ్‌సైట్: www.gailonline.com.