IDBI RECRUITMENT
●పోస్టు: బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ ●మొత్తం ఖాళీలు: 300.
జనరల్ -137, ఎస్సీ-45, ఎస్టీ-22, ఓబీసీ-81, ఈడబ్ల్యూఎస్-15 ఖాళీలు ఉన్నాయి.
●అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు 45 శాతం మార్కులు వస్తే సరిపోతుంది.
●వయస్సు: 2019, మార్చి 1 నాటికి 20 -25 ఏండ్ల మధ్య ఉండాలి.
●గమనిక: ఎగ్జిక్యూటివ్‌గా మొదట కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తారు. అభ్యర్థి పనితనాన్ని బట్టి ఈ కాలవ్యవధిని మూడేండ్ల వరకు పొడగిస్తారు. అనంతరం ఐడీబీఐలో అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ ఏ)గా బ్యాంకు నిబంధనల ప్రకారం ఎంపిక ప్రక్రియ చేపట్టి రెగ్యులర్ ఉద్యోగ అవకాశం కల్పిస్తారు.
●జీతం: మొదటి ఏడాది నెలకు రూ. 22 వేలు, రెండో ఏడాది నెలకు రూ. 24 వేలు, మూడో ఏడాది నెలకు రూ. 27 వేలు ఇస్తారు.
●ఎంపిక ప్రక్రియ: -ఆన్‌లైన్ టెస్ట్ ద్వారా చేస్తారు. -పరీక్షలో రీజనింగ్-50, ఇంగ్లిష్ లాంగ్వేజ్-50, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-50 మార్కుల చొప్పున మొత్తం 150 ప్రశ్నలు- 150 మార్కులు. -పరీక్ష కాలవ్యవధి - 90 నిమిషాలు. పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కుల కోతవిధిస్తారు.
●దరఖాస్తు చివరితేదీ: ఏప్రిల్ 15
●వెబ్‌సైట్: www.idbi.com 👈