NTRO TECHNICAL ASSISTANT NOTIFICATION

భారత ప్రభుత్వ పరిధిలోని నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్‌టీఆర్‌వో) ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఖాళీగా ఉన్న టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

●ఎలక్ట్రానిక్స్- 52 పోస్టులు 
(జనరల్-20, ఈడబ్ల్యూఎస్-9, ఓబీసీ-15, ఎస్సీ-5, ఎస్టీ-3) ●అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ /బోర్డు నుంచి సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్‌లతో బ్యాచిలర్ డిగ్రీ లేదా మూడేండ్ల డిప్లొమా (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్)లో ఉత్తీర్ణత. డిప్లొమా/టెక్నికల్ ప్రొఫిషియన్సీ సర్టిఫికెట్‌తో పాటు కంప్యూటర్ స్కిల్స్‌పైన మంచి పరిజ్ఞానం ఉండాలి. 

●కంప్యూటర్ సైన్స్- 75 పోస్టులు (జనరల్-28, ఈడబ్ల్యూఎస్-13, ఓబీసీ-22, ఎస్సీ-7, ఎస్టీ-5) 
●అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ /బోర్డు నుంచి సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్‌లతో బ్యాచిలర్ డిగ్రీ లేదా కంప్యూటర్ అప్లికేషన్‌లో డిగ్రీ, మూడేండ్ల డిప్లొమా (కంప్యూటర్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఐటీ)లో ఉత్తీర్ణత. డిప్లొమా/టెక్నికల్ ప్రొఫిషియన్సీ సర్టిఫికెట్‌తోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. 
●వయస్సు: 30 ఏండ్లకు మించరాదు. 
●పేస్కేల్: రూ. 35,400-1,12,400/- -పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, చెన్నై, ముంబై, బెంగళూరు, న్యూఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా 25 సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తారు. 
●ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ పరీక్ష. 
●ఆబ్జెక్టివ్ విధానంలో టైర్1, టైర్2 సీబీటీ పరీక్ష నిర్వహిస్తారు. 
●దరఖాస్తు: ఆన్‌లైన్‌లో -రిజిస్ట్రేషన్ ప్రారంభం: మార్చి 15 ●చివరితేదీ: ఏప్రిల్ 4 -టైర్1 పరీక్షతేదీ: ఏప్రిల్ 4 -టైర్2 పరీక్షతేదీ: మే 18,19 
●వెబ్‌సైట్: http://ntro.gov.in