SSC CHSL 2019 NOTIFICATION

CHSL EXAM
కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఎల్‌డీసీ, పోస్టల్ అసిస్టెంట్, డీఈవో పోస్టుల భర్తీకి నిర్వహించే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (10+2) ఎగ్జామినేషన్-2018 నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. 

(భారత ప్రభుత్వ పరిధిలోని పలు మంత్రిత్వశాఖల్లో, విభాగాల్లో, కార్యాలయాల్లో కింది పోస్టుల భర్తీకి సీహెచ్‌ఎస్‌ఎల్ ఎగ్జామ్‌ను నిర్వహిస్తుంది.)

●పోస్టు: లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్‌డీసీ)/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జేఎస్‌ఏ) 
●పేస్కేల్: రూ.5,200-20,200+ గ్రేడ్‌పే రూ.1,900 -పోస్టు: పోస్టల్ అసిస్టెంట్ (పీఏ)/సార్టింగ్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) -పేస్కేల్: రూ.5,200-20,200+ గ్రేడ్‌పే రూ.2,400

●పోస్టు: డాటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈవో)
●పేస్కేల్: రూ.5,200-20,200+ గ్రేడ్‌పే రూ.2,400

●పోస్టు: డాటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ
●పేస్కేల్: రూ.5,200-20,200+ గ్రేడ్‌పే రూ.2,400

●వయస్సు: 2019, ఆగస్టు 1 నాటికి 18-27 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే అభ్యర్థులు 1992, ఆగస్టు 2 నుంచి 2001,ఆగస్టు 1 మధ్య జన్మించి ఉండాలి.
●ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

●విద్యార్హతలు: 2019, ఆగస్టు 1 నాటికి ఎల్‌డీసీ/జేఎస్‌ఏ, పీఏ/ఎస్‌ఏ, డీఈవో (కాగ్‌లో డీఈవో పోస్టులకు తప్ప) - గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.

●కాగ్‌లో డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు గుర్తింపు పొందిన బోర్డు/ సంస్థ నుంచి ఇంటర్ సైన్స్ స్ట్రీమ్‌లో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా ఉత్తీర్ణులై ఉండాలి.

●ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే.
●దరఖాస్తు: ఆన్‌లైన్‌లో -చివరితేదీ: ఏప్రిల్ 5 (5 PM వరకు) ●ఫీజు: రూ.100/- (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్లకు ఫీజు లేదు)
●చివరితేదీ: ఏప్రిల్ 7
●రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ 
●టైర్-I పరీక్ష తేదీలు: జూలై 1 నుంచి జూలై 26 మధ్య
●టైర్-II పరీక్షతేదీ: సెప్టెంబర్ 29 
●వెబ్‌సైట్: Click here https://ssc.nic.in