సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్-2019కు సంబంధించిన నోటిఫికేషన్‌ను యూపీఎస్సీ విడుదల.
●ఈ కామన్ ఉమ్మడి పరీక్ష ద్వారా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్), సెంట్రల్ రిజర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), సశస్త్ర సీమాబల్ (ఎస్‌ఎస్‌బీ) తదితర విభాగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ (గ్రూప్ ఏ) పోస్టులను భర్తీచేస్తారు.●మొత్తం పోస్టుల సంఖ్య: 323 -విభాగాలవారీగా ఖాళీలు: సీఆర్‌పీఎఫ్-100, బీఎస్‌ఎఫ్-100, ఎస్‌ఎస్‌బీ-66, సీఐఎస్‌ఎఫ్-28, ఐటీబీపీ-21
●అర్హతలు: గుర్తింపు పొందిన సంస్థ/యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
●వయస్సు: 2019, ఆగస్టు 1 నాటికి 20 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేండ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లవరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ●శారీరక ప్రమాణాలు: ఎత్తు: పురుషులు- 165 సెం.మీ., ఛాతీ: 81 సెం.మీ., గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచించాలి. మహిళలు- 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ●ఎంపిక: రాతపరీక్ష, పీఈటీ/పీఎస్‌టీ, పర్సనాలిటీ టెస్ట్/ఇంటర్వ్యూ. -800 మీటర్ల పరుగు పందెంను పురుషులు 3 నిమిషాల 45 సెకండ్లు, మహిళలు 4 నిమిషాల 45 నిమిషాల్లో, 100 మీటర్ల పరుగు పందెంను పురుషులు 16 సెకండ్లు, మహిళలు 18 సెకండ్లు పూర్తి చేయాలి.
●లాంగ్‌జంప్‌ను పురుషులు-3.5 మీటర్లు, మహిళలు-3.0 మీటర్లు (మూడు పర్యాయాల్లో), షాట్‌పుట్ (7.26 కేజీలు) పురుషులు 4.5 మీటర్ల దూరం వేయాలి.
●రాతపరీక్షలో రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. పేపర్-1లో జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ నుంచి ఆబ్జెక్టివ్ విధానంలో 250 మార్కులు, పేపర్-2లో జనరల్ స్టడీస్, ఎస్సే అండ్ కాంప్రహెన్షన్ సంబంధిత అంశాల్లో 200 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు.
●పేపర్-1లో అర్హత సాధించినవారు మత్రమే పేపర్-2 పరీక్ష రాయడానికి అర్హులు. -పేపర్-1లో నెగెటివ్ మార్కింగ్‌లో భాగంగా ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కుల కోత విధిస్తారు.
●పర్సనాలిటీ టెస్ట్/ఇంటర్వ్యూ 150 మార్కులకు ఉంటుంది. ●దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
●దరఖాస్తు ఫీజు: రూ.200/-(ఎస్సీ/ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు)
●దరఖాస్తులకు చివరితేదీ: మే 20 -పరీక్ష తేదీ: ఆగస్టు 18 ●వెబ్‌సైట్: www.upsconline.nic.in