NABARD RECRUITMENT

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ & రూరల్ డెవలప్‌మెంట్‌లో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
https://www.nabard.org
పోస్టులు: గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ (రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంకింగ్ సర్వీస్)
●ఖాళీల సంఖ్య- 79
●అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ లేదా పీజీ లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులైతే 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా డిగ్రీతోపాటు సీఏ/సీఎస్ -లేదా డిగ్రీతోపాటు రెండేండ్ల పీజీడిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ లేదా ఫుల్‌టైం ఎంబీఏ ఉత్తీర్ణత.
●వయస్సు: 21- 30 ఏండ్ల మధ్య ఉండాలి.

పోస్టులు: గ్రేడ్ బీ మేనేజర్ (రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంకింగ్ సర్వీస్)
●ఖాళీల సంఖ్య-8
●అర్హతలు: మేనేజర్ (జనరల్)కు కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలు అయితే 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఇతర విభాగాలకు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ ఉత్తీర్ణత.
●వయస్సు: 21- 35 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ వర్గాలకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ●ఎంపిక: పై రెండు పోస్టులకు మూడుదశల్లో ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూ ద్వారా.
●దరఖాస్తు: ఆన్‌లైన్‌లో మే 10 నుంచి ప్రారంభం
●చివరితేదీ: మే 26
●Click here: https://www.nabard.org 👈