పొలీసు నియామకాల తుది రాత పరీక్ష ఫలితాలు విడుదల.
●login అవ్వాలి RESULTS
● www.tslprb.in వెబ్‌సైట్‌లో కీ అందుబాటులో ఉంటుంది, ఓఎమ్మార్ స్కానింగ్ పత్రాలు కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
●టీఎస్‌ఎల్పీఆర్బీ వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 28 ఉదయం 8 నుంచి 30వతేదీ రాత్రి 8 గంటల వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు అవకాశం ఉందని, ఇందుకు ప్రతి పేపర్‌కు ఎస్సీ, ఎస్టీలు రూ. 2000, ఇతరులు, స్థానికేతరులు రూ.3000 చెల్లించాలని పేర్కొన్నారు. క్వాలిఫై మార్కులు సరిపోయే ఇంగ్లిష్, హిందీ లేదా ఉర్దూ పేపర్ల విషయంలో రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తులను అనుమతించబోమని స్పష్టంచేశారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు వెళ్లిన అభ్యర్థుల ఫలితాలు మే 30 తర్వాత వెబ్‌సైట్‌లో వారి వ్యక్తిగత లాగిన్ ఉపయోగించి తెలుసుకోవచ్చని వెల్లడించారు.
●రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌తోపాటు అభ్యర్థుల తుదిఎంపిక ప్రక్రియ పూర్తయ్యే ముం దు అభ్యర్థులకు దరఖాస్తులోని డాటాను సరిచేసుకునేందుకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వనున్నట్టు శ్రీనివాసరావు తెలిపారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ముందే ఈ అవకాశం ఉంటుంది..
●అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్యా
Civil SI 36,829
SI IT 1,315
ASI FPB 935
CONSTABLE 93,21
CONSTABLE IT 3,051
CONSTABLE DRIVER 375
CONSTABLE MECHANIC 113
●ఈ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు ఎదురైనా 93937 11110, 93910 05006 నంబర్లలో సంప్రదించాలి..
supprot@tslprb.in చిరునామా కి ఇమెయిల్ చేయాలి..