Indian navy recruitment 2019

ఇండియన్ నేవీ 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీం (పర్మినెంట్ కమిషన్ ) కింద నాలుగేండ్ల బీటెక్ కోర్సు చేయడానికి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి ఎజిమల (కేరళ)లోని ఇండియన్ నేవల్ అకాడమీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
www.joinindiannavy.gov.in
●కోర్సు పేరు: 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీం 
●వయస్సు: 2000, జూలై 2 నుంచి 2003, జనవరి1 మధ్య జన్మించి ఉండాలి. 
●విద్యార్హతలు: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో కనీసం 70 శాతం మార్కులతో ఇంటర్ లేదా 10+2 పరీక్ష ఉత్తీర్ణత. ఇంగ్లిష్ (ఎస్‌స్‌సీ/ఇంటర్‌స్థాయి)లో కనీసం 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి. జేఈఈ మెయిన్ -2019 ఎగ్జామ్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. 
●శారీరక ప్రమాణాలు: ఎత్తు - కనీసం 157 సెం.మీ., ఎత్తుకు తగ్గ బరువు & ఇండియన్ నేవీ నిర్దేశించిన కంటి చూపు, ఇతర వైద్య ప్రమాణాలు ఉండాలి. 
●ఎంపిక: జేఈఈ మెయిన్-2019 ఆల్ ఇండియా ర్యాంక్ ఆధారంగా సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తుంది. అనంతరం ఎస్‌ఎస్‌బీ బోర్డు ఆగస్టు-అక్టోబర్ మధ్య బెంగళూరు, భోపాల్, కోయంబత్తూర్, వైజాగ్‌లలో ఏదో ఒకచోట ఇంటర్వ్యూలను మొత్తం 5 రోజులపాటు ఇంటర్వ్యూ రెండు దశల్లో కొనసాగిస్తుంది. 
●స్టేజ్ -1లో ఇంటెలిజెన్స్ టెస్ట్, పిక్చర్ ప్రిసిప్షన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ ఉంటాయి. వీటిలో అర్హత సాధించిన వారిని స్టేజ్ - 2కు ఎంపిక చేస్తారు. 
●స్టేజ్ - 2లో సైకలాజికల్ టెస్టింగ్, గ్రూప్ టెస్టింగ్, ఇంటర్వ్యూ ●ఆల్ ఇండియా మెరిట్ ప్రకారం ఎంపికైన అభ్యర్థులను కేరళ ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో బీటెక్‌లో ప్రవేశం కల్పిస్తారు. కోర్సు పూర్తయిన తర్వాత జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) బీటెక్ సర్టిఫికెట్‌ను ప్రదానం చేస్తుంది. 
●పేస్కేల్ : సబ్ లెఫ్టినెంట్ హోదాలో నెలకు సుమారుగా రూ. 83,448-96,204/-జీతం చెల్లిస్తారు. 
●దరఖాస్తు: ఆన్‌లైన్‌లో 
●చివరితేదీ: జూన్ 17 
●వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in 👈

For more notifications click here