Rashtriya ispat Nigam limited (RINL) చెందిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఖాళీగా ఉన్న జూనియర్ ట్రెయినీ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
మొత్తం పోస్టులు: 594
●జూనియర్ ట్రెయినీ-530(జనరల్-213, ఈడబ్ల్యూఎస్-70, ఓబీసీ-147, ఎస్సీ-90, ఎస్టీ-10)
విభాగాలవారీగా ఖాళీలు:
●మెకానికల్-260
●ఎలక్ట్రికల్-115
●మెటలర్జి-86
●కెమికల్-43
●ఎలక్ట్రానిక్స్-5
●ఇన్‌స్ట్రుమెంటేషన్-9
●సివిల్-2
●రిఫ్రాక్టరీ-10
●అర్హత: ఎస్‌ఎస్‌సీ/మెట్రిక్యులేషన్+ ఫుల్‌టైమ్ ఐటీఐ లేదా సంబంధిత ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత. అదనంగా ఇంటర్, బీఎస్సీ, బీకాం, బీఏ, బీఈ/బీటెక్, బీఎల్, బీహెచ్‌ఎంఎస్, ఎంబీఏ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆపరేటర్ కమ్ మెకానిక్ ట్రెయినీ-29
(జనరల్-13, ఈడబ్ల్యూఎస్-3, ఓబీసీ-7, ఎస్సీ-5, ఎస్టీ-1) ●అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ/డిప్లొమా ఉండాలి. హెవీ మోటార్ వెహికిల్ లైసెన్స్ ఉండాలి.
●వయస్సు: 2019 జూలై 1 నాటికి 27 ఏండ్లకు మించరాదు. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
●పే స్కేల్: జూనియర్ ట్రెయినీలకు శిక్షణలో భాగంగా మొదటి ఏడాదికి రూ.10,700/-, రెండో ఏడాదికి రూ.12,200/- స్టయిఫండ్ ఇస్తారు. ప్రొబేషనరీ పీరియడ్ తర్వాత రెగ్యులర్ పే స్కేల్ రూ. 16800-3%-24,110/-. ●అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.300/-(ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీలకు ఎలాంటి ఫీజు లేదు)
●ఎంపిక: రాత పరీక్ష ద్వారా
●రాత పరీక్ష సిలబస్: జనరల్ ఆప్టిట్యూడ్, సంబంధిత సబ్జెక్ట్ అంశాలపై ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నపత్రం తెలుగు/ఇంగ్లిష్‌లో ఉంటుంది. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను మెరిట్ ప్రాతిపదికన సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. కేవలం రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా ఎంపిక జాబితాను ప్రకటిస్తారు.
●దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
●చివరితేదీ: ఆగస్టు 21
●వెబ్‌సైట్: www.vizagsteel.com 👈
●For Latest Job's CLICK HERE 👈
వీటితో పాటు క్రింది పోస్టులకు కాంట్రాక్టు ఉద్యోగాల ప్రకటన
మెడికల్ ఆఫీసర్-6, రేడియాలజిస్ట్-1, ఆపరేటర్ కమ్ మెకానిక్స్-12, మైన్ ఫోర్‌మ్యాన్-5, డ్రిల్ టెక్నీషియన్-5, బ్లాస్టర్-2, బ్లాస్టింగ్ హెల్పర్-4
●అర్హతలు: ఎంబీబీఎస్, ఎస్‌ఎస్‌సీ, డిప్లొమా (ఇంజినీరింగ్), వినియోగంలో ఉన్న హెవీ మోటార్ వెహికిల్ లైసెన్స్ ఉండాలి.
గమనిక: ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీచేస్తారు.
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 31
●For Latest Jobs CLICK HERE 👈