HDFC has released its admission 2019 announcement of the PGDiploma program for the replacement of future banker posts

HDFC ఫ్యూచర్ బ్యాంకర్ పోస్టుల భర్తీకి నిర్వహించే పీజీడిప్లొమా ప్రోగ్రామ్ ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. 
●పోస్టు: ఫ్యూచర్ బ్యాంకర్ 
●ఎంపిక: ఏడాది కాలవ్యవధిగల పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా శిక్షణను ఇచ్చి దానిని విజయవంతంగా పూర్తిచేసినవారికి ఉద్యోగావకాశాన్ని సంస్థ కల్పిస్తుంది. 
●ప్రోగ్రామ్ వివరాలు: ఆరునెలలు రెసిడెన్షియల్ శిక్షణనిస్తారు. ఈ సమయంలో నెలకు రూ.5,500/- స్టయిఫండ్‌నిస్తారు. ఆ తర్వాత మూడునెలలు ఇంటర్న్‌షిప్ చేస్తున్న సమయంలో నెలకు రూ.10,000/- ఇస్తారు. ఆ తర్వాతి మూడునెలలు బ్యాంకులో శిక్షణనిస్తూ నెలకు పదివేలు ఇస్తారు. 
●శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ సేల్స్&రిలేషన్‌షిప్ బ్యాంకింగ్ సర్టిఫికెట్‌తోపాటు డిప్యూటీ మేనేజర్‌స్థాయిలో పర్సనల్ బ్యాంకర్ ఉద్యోగావకాశాన్ని హెచ్‌డీఎఫ్‌సీ కల్పిస్తుంది. 
●బెంగళూరులోని మణిపాల్ ఎడ్యుకేషన్ క్యాంపస్‌లో ఆరునెలల శిక్షణనిస్తారు. తర్వాత ఆరునెలలు దేశవ్యాప్తంగా ఉన్న ఏదైనా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఇంటర్న్‌షిప్, బ్యాంకు శిక్షణనిస్తారు. 
●అర్హతలు: 2019, జూన్ 1 నాటికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 55 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. 
●వయస్సు: 21- 26 ఏండ్ల మధ్య ఉండాలి. -ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు. 
●ఆన్‌లైన్ టెస్ట్: దీనిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్, లాజికల్&క్వాంటిటేటివ్ ఎబిలిటీ, పర్సనల్ టెస్ట్, సేల్స్ ఆప్టిట్యూడ్‌పై ప్రశ్నలు ఇస్తారు. 
●దరఖాస్తు: ఆన్‌లైన్‌లో 
●పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: https://futurebankers.myamcat.com 👈