భారత ఆర్మీలో షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) ఏప్రిల్ 2020 కోర్సులో ప్రవేశానికి ఇంజినీరింగ్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు ఎస్‌ఎస్‌సీ (టెక్) ద్వారా ఇంజినీరింగ్ అభ్యర్థులకు షార్ట్ సర్వీస్ కమిషన్ కింద ఉద్యోగావకాశాన్ని కల్పిస్తారు.
●మొత్తం ఖాళీలు: 189
●బ్రాంచీల వారీగా ఖాళీలు:
సివిల్-50, మెకానికల్-16. ఎలక్ట్రానిక్స్& టెలికామ్ లేదా టెలికమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్-కమ్యూనికేషన్ లేదా శాటిలైట్ కమ్యూనికేషన్-25. ఏరోనాటికల్/బాలిస్టిక్స్/ఏవియానిక్స్-12. ఎలక్ట్రానిక్స్/ఆప్టో ఎలక్ట్రానిక్స్/ఫైబర్ ఆప్టిక్స్/ మైక్రో ఎలక్ట్రానిక్స్&మైక్రోవేవ్-8, ప్రొడక్షన్ ఇంజినీరింగ్-3. ఆర్కిటెక్చర్/బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ-4. ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్&ఎలక్ట్రానిక్స్-24. కంప్యూటర్ సైన్స్& ఇంజినీరింగ్/కంప్యూటర్ టెక్నాలజీ/ ఐటీ/ఎమ్మెస్సీ (కంప్యూటర్ సైన్స్)-47.
●అర్హతలు: సంబంధిత బ్రాంచీలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత లేదా ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 2020, ఏప్రిల్ 1 నాటికి ఇంజినీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. శిక్షణ ప్రారంభమైన 12 వారాల్లోగా సర్టిఫికెట్‌ను సమర్పించాలి.
●వయస్సు: ఎస్‌ఎస్‌టీ (టెక్)-54 మెన్, ఎస్‌ఎస్‌సీడబ్ల్యూ (టెక్)-25 ఉమెన్ కోర్సులకు 2020, ఏప్రిల్ 1 నాటికి 20-27 ఏండ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. అంటే 1993, ఏప్రిల్ 2 నుంచి 2000, ఏప్రిల్ 1 మధ్య జన్మించి ఉండాలి.
అభ్యర్థులు అవివాహిత పురుషులు, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఎంపిక విధానం: రెండు దశల్లో చేస్తారు. -మొదటి దశలో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.
రెండో దశలో వీరికి సర్వీస్ సెలెక్షన్ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. SSB ఇంటర్వ్యూలను అలహాబాద్(ఉత్తరప్రదేశ్), భోపాల్ (మధ్యప్రదేశ్), బెంగళూరు (కర్ణాటక), కపుర్తలా (పంజాబ్)లో నిర్వహిస్తారు.
ఎంపికైన వారికి 49 వారాలు చెన్నైలోని ఆఫీసర్స్ ట్రెయినిగ్ అకాడమీలో శిక్షణ ఇస్తారు. అనంతరం లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగం ఇస్తారు.
●పేస్కేల్: శిక్షణ సమయంలో నెలకు రూ.56,100/- ఇస్తారు. అనంతరం లెవల్ పే 10 ప్రకారం రూ.56,100-1,77,500/-
●దరఖాస్తు: ఆన్‌లైన్‌లో ●చివరితేదీ: ఆగస్టు 22
●వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in