టెక్ మహేంద్ర (Tech Mahindra)ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ (Free Coaching) కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు సంస్థ ప్రతినిధి నిరంజన్ తెలిపారు. జంట నగరాలలో (Twin Cities)నిరుద్యోగ యువతీయువకుల కోసం (Tech Mahindra Foundation) టెక్ మహేంద్ర ఫౌండేషన్ సహకారంతో నిర్మాణ్ సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు.
అర్హతలు: టెన్త్, ఇంటర్, డిగ్రీ పాస్/ఫెయిల్ అయి ఉండి.వయస్సు: 18 నుండి 27 ఏండ్లలోపు వయసున్న అభ్యర్థులు.
కోర్సులు: నాలుగు నెలల పాటు కంప్యూటర్ బేసిక్స్, ఐటీ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్ 2010, అడ్వాన్స్ ఎంఎస్ ఎక్సెల్, స్పోకెన్ ఇంగ్లిష్, ఇంగ్లిష్ టైపింగ్, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, టాలీ, ఈఆర్‌పీ 9, బేసిక్ అకౌంట్స్, జీఎస్టీ వంటి కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు.
ఆసక్తి గల అర్హత ఉన్న అభ్యర్థులు నవంబర్ 6వ తేదీ లోపు తమ శిక్షణ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 9515665095, 9100330378 లో సంప్రదించాలి..