కరోనాకు డ్రగ్​ రిలీజ్​ చేసిన భరత కంపెనీ ఒక్కో టాబ్లెట్ రూ.103

కరోనాకు డ్రగ్​ రిలీజ్​- ఒక్కో టాబ్లెట్ రూ.103 ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ చికిత్సకు ఔషధం సిద్ధమైంది. భారత ఫార్మా దిగ్గజం గ్లెన్‌మార్క్‌ కొత్త మందును ఆవిష్కరించినట్టు వెల్లడించింది. 

ఇప్పటికే మూడు దశల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది. ఒక ఫవిపిరావీర్​ టాబ్లెట్ ధర సుమారు రూ.103 వరకు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు పీటీఐ వార్త సంస్థ వెల్లడించింది.
కరోనాకు డ్రగ్​ రిలీజ్​ చేసిన భరత కంపెనీ ఒక్కో టాబ్లెట్ రూ.103
కరోనాపై పోరులో మరో ముందడుగు పడింది. వైరస్ సోకిన రోగులకు చికిత్స కోసం 'ఫవిపిరావీర్​' అనే ఔషధాన్ని ఆవిష్కరించింది ఫార్మాస్యూటికల్ సంస్థ గ్లెన్​మార్క్. ఫాబిఫ్లూ బ్రాండ్​ పేరుతో తెస్తున్న ఈ ఔషధం తేలికపాటి లేదా ఓ మోస్తరు స్థాయిలో కరోనాతో బాధపడుతున్న రోగులకు ఉపయోగపడుతుందని పేర్కొంది.

కరోనాకు డ్రగ్​ రిలీజ్​- ఒక్కో టాబ్లెట్ రూ.103

ఒక 200 ఎంజీ టాబ్లెట్ ధర సుమారు రూ.103 వరకు ఉంటుందని, 34 టాబ్లెట్​లు ఉండే ఓ స్ట్రిప్... గరిష్ఠ రిటైల్ ధర రూ.3,500 వరకు ఉంటుందని గ్లెన్​మార్క్ వెల్లడించింది.

హిమాచల్​ప్రదేశ్​లో ప్రస్తుతం ఈ టాబ్లెట్లను హిమాచర్​ప్రదేశ్​లో ఉత్పత్తి చేస్తున్నట్లు గ్లెన్​మార్క్ తెలిపింది. ఆసుపత్రుల్లో, రిటైల్ దుకాణాల్లో ఈ ఔషధం లభిస్తుందని వెల్లడించింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి తయారీ, మార్కెటింగ్ అనుమతి పొందినట్లు ముంబయికి చెందిన ఈ సంస్థ పేర్కొంది. భారత్​లో విపరీతంగా కొవిడ్​ కేసులు, మరణాలు పెరిగిపోతున్న నేపథ్యంలో మహమ్మారి నివారణకు ఈ ఔషధం ఉపయోగపడుతుందని గ్లెన్​మార్క్ ఆశాభావం వ్యక్తం చేసింది