నీకష్టం_వృధాపోలేదు_నీలక్ష్యం_ఆగిపోలేదు
#హిమదాస్ ఒక్కసారిగా ప్రపంచం చూపు
నాదేశంవైపు తిప్పిన మట్టిలో మాణిక్యం
కష్టంలో నుండి పుట్టిన మరో కోహినూరు వజ్రం
మొట్టమొదటిసారి ట్రాక్ అండ్ ఫీల్డ్ లో అంతర్జాతీయ
స్థాయిలోబంగారు పతకాన్ని సాధించిన స్వర్ణకుసుమం
సకలసౌకర్యాలు ఉండి ఆడి గెలవడం అసాధ్యం
అయితే కాదు గాని.. కష్టం అయితే ఎంతమాత్రం కాదు
కానీ....., నిరుపేద కుటుంబంలో పుట్టి నిస్సత్తువగా
మొదలైన నీప్రయాణం శక్తినంతా ధారపోసి నిర్విరామంగా
సాగుతూ నిరంతరకృషితో నేడు నింగికెగసినవేళ నీకన్నీళ్లే
సాక్ష్యం నీ కఠోర సాధనకు లక్ష్యం పట్ల నీ అంకితభావానికి
మనకున్న లక్ష్యం దానిపై మనగురి సాధించాలన్న
తపన సాధిస్తానన్న ఆత్మస్థైర్యం ముందు పేదరికంకూడా
చిన్నబోతుందని ప్రపంచానికి చాటిచెప్పిన నేటి మేటి
నిరుపేద క్రీడాకారులలో స్ఫూర్తిని అంతకి మించిన
ఆత్మస్థైర్యాన్ని నింపిన భవిష్యత్తరాల ఆశాజ్యోతివి
వరుసగా అయిదు స్వర్ణాలు అందించి
విజయ బాహుటా చేతబూని నాదేశపు
జెండాని ప్రపంచదేశాల ముందు
గర్వంగా ఎగురవేస్తూ రెపరేపలాడించిన నీ కష్టం...
వృధా పోలేదు.. అంచెలంచెలుగా అత్యున్నత స్థానాన్ని
అధిరోహిస్తూ అఖండ ఖ్యాతిని అందుకుంది...
కడుపుకట్టుకుని కాళ్ళల్లో బలాన్ని పుంజుకుని
నీపరుగుతో లక్ష్యాన్ని ముందుకు నడిపించిన
ప్రపంచపటంలో నాదేశానికి ఎప్పటికీ సడలని
మరో మైలురాయిని అందించిన నీ ఆశయానికి
అండగా డీఎస్పీ గా పదోన్నతి కల్పించి....
అసలుసిసలైన గౌరవాన్ని అందించింది.
#Congratulations_Golden_girl_HIMADAS
#GOD_BLESS_YOU 💐 💐 💐 💐 💐 💐 💐
Credit by :- సూర్యప్రకాష్ గొడత
Click here for Sarkari jobs