మహారత్న కంపెనీ అయిన కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్)లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకిని నోటిఫికేషన్ విడుదలయింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
ఈ నోటిఫికేషన్ ద్వరా మొత్తం 588 ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇంజినీరింగ్, డిగ్రీ చేసినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ దరఖాస్తులు వచ్చే నెల 9 వరకు అందుబాటులో ఉంటాయి. గేట్-2021 స్కోర్ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
మొత్తం పోస్టులు: 588
ఇందులో మైనింగ్ 253, ఎలక్ట్రికల్ 117, మెకానికల్ 134, సివిల్ 57, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ 15, జియాలజీ 12 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: జియాలజీ పోస్టులకు జియాలజీ, అప్లయిడ్ జియాలజీ, జియోఫిజిక్స్, అప్లయిడ్ జియోఫిజిక్స్‌లో ఎమ్మెస్సీ, ఎంటెక్‌లలో ఏదోఒకటి 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులవాలి. మిగిలిన పోస్టులకు ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, సివిల్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: గేట్-2021 మార్కుల ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ.1000 + 180 (జీఎస్టీ), ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థ/లకు ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 9
వెబ్‌సైట్: www.coalindia.in