SCHEME OF FREE COACHING FOR SC AND OBC STUDENTS APPLY NOW

ఉచిత కోచింగ్‌ను అందించే పథకమే ‘స్కీం ఫర్‌ ఫ్రీ కోచింగ్‌ ఫర్‌ ఎస్సీ అండ్‌ ఓబీసీ స్టూడెంట్స్‌’.


ఫ్రీ కోచింగ్‌ లక్ష్యం
ప్రతిభ ఉన్నా తగు ఆర్థిక వనరులు లేక పోటీప్రపంచంలో అనేక కాంపిటీటివ్‌/అకడమిక్‌ పరీక్షల్లో ఎస్సీ, ఓబీసీ విద్యార్థులు రాణించలేకపోతున్నారు. ఇటువంటి వారికి భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏటా ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ స్కీంకు ఎంపికైన విద్యార్థులకు వారు ప్రిపేరవుతున్న ఆయా పరీక్షలకు సంబంధించి ఉచిత శిక్షణకు కావల్సిన ఆర్థిక సహాయం అందిస్తుంది ఈ సంస్థ.
ఎవరు అర్హులు?
కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉన్న ఎస్సీ, ఓబీసీ అభ్యర్థులు అభ్యర్థి రాయబోయే పరీక్షలకు సంబంధించిన ఇంటర్‌, డిగ్రీ, బీఈ/బీటెక్‌లలో కనీస మార్కులు సాధించాలి.

స్కీం ప్రయోజనాలు.?
స్కీం కింద అభ్యర్థులు ప్రిపేరవుతున్న ఆయా కోచింగ్‌లకు సంబంధించిన ఫీజును ప్రభుత్వం చెల్లిస్తుంది.
అదేవిధంగా శిక్షణ సమయంలో స్టయిఫండ్‌ కింద స్థానికంగా ఉన్నవారికి నెలకు రూ.3,000, దూరప్రాంతాల వారికి రూ.6,000 చెల్లిస్తారు. అదేవిధంగా పీహెచ్‌సీ అభ్యర్థులు ఉంటే వారికి అదనంగా మరో రెండు వేలు ఇస్తారు.

స్కీం అమలు ఇలా..
ఈ స్కీం రెండు పద్ధతుల్లో అమలు చేస్తారు. విద్యార్థులు ఏదైనా ఒకదానిని ఎంచుకోవచ్చు.
మొదటి పద్ధతిలో మొత్తం సీట్లను గుర్తింపు పొందిన కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు అప్పగిస్తారు. విద్యార్థుల ఎంపిక ఆయా ఇన్‌స్టిట్యూట్‌లే చేపడుతాయి. ఎంపికైన వారికి ఫ్రీగా కోచింగ్‌ ఇస్తారు. దీనికి సంబంధించిన ఫీజును కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ చెల్లిస్తుంది.
రెండో పద్ధతిలో మొత్తం సీట్లకుగాను సంబంధిత మంత్రిత్వశాఖ విద్యార్థులను ఎంపిక చేస్తుంది. విద్యార్థులు వారికి ఇష్టమైన కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ పొందవచ్చు. కోచింగ్‌కు సంబంధించి చెల్లించాల్సిన ఫీజును రెండు విడుతల్లో అభ్యర్థుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం వేస్తుంది. 
 >>> CLICK HERE TO APPLY 👈
LAST DATE OF SUBMISSION OF APPLICATIONS UNDER MODE 2 OF FCS FOR 2021-22 IS 10.09.2021.