ఆదిమ గిరిజన సమాజానికి చెందిన గర్భిణీ స్త్రీ, పోలీసు కస్టడీ నుండి తప్పిపోయిన తన భర్త కోసం తీవ్రంగా వెతుకుతుంది. ఆమె భర్తను కనుగొని వారికి న్యాయం చేయాలని ఒక హైకోర్టు న్యాయవాది (సూర్య) మద్దతుగా నిలుస్తారు. ఇది మొత్తానికి కథ అంశం.
ఒక్క కుర్చీ విరక్కుండా , ఒక్కటంటే ఒక్క ఫైటింగ్ సీన్ లేకుండానే హీరోయిజం చూపించవచ్చు అని తెలుగు డైరెట్టర్లు ఎప్పటికి గ్రహిస్తారో .. ఏ నకరాలూ చెయ్యకుండా , ఏ ఫారిన్లోనూ గెంతకుండానే తమ అభిమాన నటుడు హీరోగానే కనబడవచ్చు అని ఈ సినిమా ద్వారా నిరూపించారు.
సినిమా టైటిల్ జై భీం అని తెలియగానే అది తప్పకుండా అలగాజనం చేసే అనవసర రచ్చ అని డిసైడ్ అయ్యి సినిమా చూడకుండా కూర్చున్న ఓపెన్ కులగజ్జి స్నేహితులకు, జై భీం అంటే ఏదో మాలా మాదిగ దళితుల గోలే ఉంటుందిలే అని అనుమానంతో చూసి ఇదంతా ట్రైబల్స్ గురించిన కథ అని తెలిసి హమ్మయ్యా అని వూపిరి పీల్చుకున్న ముసుగు దొంగలకు కూడా నీల్ సలాం . ఏది ఏమైనా నోటివెంట జై భీం అనే నినాదం పలకాలంటే గొంతులో ఆవపెట్టిన పచ్చి పనసకాయ పడే సనాతన అభ్యుదయ వాదులు కనీసం సినిమా టైటిల్ చెప్పడానికైనా ఆ పదాన్ని ఉచ్ఛరించే అగత్యం పట్టించిన డైరెక్టర్ , నిర్మాతలకు వేవేల జై భీములు !
#Indus Martin #JaiBheemOnPrime #amazonPrime