కొత్త అర్హుల నుంచి స్వీకరణ: వ్యవసాయశాఖ నుండి రైతుబంధుకు దరఖాస్తుల ఆహ్వానం.
ఈ నెల 10వ తేదీ నాటికి ధరణిలో నమోదైన, కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందిన రైతులు 2020-21 యాసంగి సీజన్ రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయశాఖ సూచించింది. ఇప్పటికే రైతుబంధు పొందుతున్నవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. రైతుబంధు పథకానికి కొత్తగా అర్హులైనవారు తమ దరఖాస్తులను స్థానిక వ్యవసాయశాఖ అధికారుల (AEO)కు అందజేయాలని పేర్కొన్నది. దరఖాస్తుతోపాటు పట్టాదార్ పాస్‌బుక్ జిరాక్స్ కాపీ లేదా తాసిల్దార్ డిజిటల్ సంతకం పెట్టిన పత్రం, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ కాపీలు అందజేయాలని తెలిపింది.