తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. అంతా పాస్.. మంత్రి సబితారెడ్డి కీలక ప్రకటన
ఇటీవల విడుదలైన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఫెయిలయిన విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు మంత్రి సబితారెడ్డి ప్రకటించారు.
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఫెయిలయిన విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు మంత్రి సబితారెడ్డి ప్రకటించారు. వారందరికీ కనీస మార్కులను కేటాయించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో కేవలం 49 శాతం ఉత్తీర్ణత మాత్రమే నమోదైన విషయం తెలిసిందే. దీంతో కొందరు విద్యార్థులు ఫెయిలయ్యామని మనస్థాపం చెంది ఆత్మహత్యకు కూడా పాల్పడ్డారు. విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాల నాయకులు ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళనలు సైతం చేపట్టారు. రోజు రోజుకూ వివాదం పెద్దది అవుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఫెయిలయిన విద్యార్థులందరినీ కనీస మార్కులతో పాస్ చేయాలని నిర్ణయించింది. ఈ వివరాలను మంత్రి సబితారెడ్డి కొద్ది సేపటి క్రితం ప్రెస్ మీట్ నిర్వహించి వెల్లడించారు.