నవోదయా విద్యాలయలో 1925 నాన్ టీచింగ్ పోస్టులు
నవోదయా విద్యాలయ సమితి (NVS) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1925 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో అసిస్టెంట్ కమిషనర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, జూనియర్ ఇంజినీర్ వంటి పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి. అయితే అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్‌టెస్ట్ ద్వారా
దరఖాస్తు విధానం: Online
అప్లికేషన్ ఫీజు: అసిస్టెంట్ కమిషనర్ రూ.1500, ఫీమేల్ స్టాఫ్ నర్స్ రూ.1200, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్, ఎంటీస్ పోస్టులకు రూ.750, ఇతర పోస్టులకు రూ.1000
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 10
వెబ్‌సైట్: https://navodaya.gov.in/nvs