ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను అందరినీ పాస్ చేస్తు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజా గా ఇంటర్ బోర్డు అధికారికంగా అందరినీ పాస్ చేసింది. అంతే కాకుండా నేటి నుంచి అధికారిక వెబ్ సైట్ లో మెమో లు అందబాటులో ఉంచారు.
1st Year General Memos CLICK HERE
1st Year Vocational Memos CLICK HERE
1st Year Bridge Course CLICK HERE
1st Year Voc Bridge Course CLICK HERE
అలాగే ఫెయిల్ అయిన వాళ్లు కట్టిన రీవెరిఫికేషన్, రీ కౌంటింగ్ దరఖాస్తులను విద్యార్థులు రద్దు చేసుకునే అవకాశం కూడా బోర్డు కల్పించింది. నేటి నుంచి ఈ నెల 17 వరకు రీవెరిఫికేషన్, రీ కౌంటింగ్ దరఖాస్తులను రద్దు చేసుకోవడానికి బోర్డు అనుమతి ఇచ్చింది. అలాగే విద్యార్ధులు రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం కొత్త గా దరఖాస్తు కూడా చేసుకోవచ్చని ఇంటర్ బోర్డ్ తెలిపింది. వీటి కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లు ఫీజు చెల్లించడానికి వచ్చే నెల 1 వ తేదీ వరకు సమయం ఉంటుందని తెలిపారు. రీవెరిఫికేషనన్, రీ కౌంటింగ్ కోసం ఫీజును తమ కాలేజీల్లోనే చెల్లించాలని సూచించింది.