NHM Telangana Recruitment 2022: నేషనల్ హెల్త్ మిషన్ (NHM) తెలంగాణ రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ (outsourcing jobs)ప్రాతిపదికన డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్(DDM), డిస్ట్రిక్ట్ అకౌంట్ మేనేజర్ (DAM) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తుల కోరుతున్నారు.
మొత్తం ఖాళీలు: 29
1. డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్ (DDM) పోస్టులు: 23
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం ఏడాదిపాటు పని అనుభవం కూడా ఉండాలి.
వయసు: అభ్యర్ధుల వయసు 34 ఏళ్లకు మించరాదు.
జీతం: ₹30,000లు జీతంగా చెల్లిస్తారు.
2. డిస్ట్రిక్ట్ అకౌంట్ మేనేజర్ (DAM) పోస్టులు: 6
అర్హతలు: ఎంబీఏ (ఫైనాన్స్)/ఎంకాం ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్ నైపుణ్యం, సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: అభ్యర్ధుల వయసు 34 ఏళ్లకు మించరాదు.
జీతం: ₹25,000లు జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు Online ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 10, 2022.
Website: https://tsnhm.cgg.gov.in