SSC CHSL Recruitment 2022: ఇంటర్ అర్హతతో 4,000 పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CHSL 2021 నోటిఫికేషన్ ద్వారా
● లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)
● జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ (JSA)
● పోస్టల్ అసిస్టెంట్ (PA)
● సార్టింగ్ అసిస్టెంట్ (SA)
● డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO)
డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ పోస్టుల్ని భర్తీ చేస్తోంది.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్ 2021 నోటిఫికేషన్ విడుదల చేసింది. గతేడాదికి సంబంధించిన రిక్రూట్‌మెంట్‌ను ఇప్పుడు చేస్తోంది. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తోంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్.
ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చును.
● అప్లై చేయడానికి 2022 మార్చి 7 చివరి తేదీ.
● కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (టైర్ 1)- 2022 మే
టైర్ 2 ఎగ్జామినేషన్ (డిస్క్రిప్టీవ్ పేపర్)- తేదీలు త్వరలో వెల్లడించనున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్
● విద్యార్హతలు- ఇంటర్మీడియట్ పాస్ కావాలి
● వయస్సు- 2022 జనవరి 1 నాటికి 18 నుంచి 27 ఏళ్లు
● దరఖాస్తు ఫీజు- రూ.100
● ఖాళీల వివరాలను https://ssc.nic.in/ వెబ్‌సైట్‌లో Candidate’s Corner సెక్షన్‌లో Tentative Vacancy క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.