భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్/ మేనేజర్ Gr-II/సూపరింటెండెంట్ ఖాళీలను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానించింది.
హోదా: సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్ / మేనేజర్ గ్రేడ్ 2 / సూపరింటెండెంట్
వయో పరిమితి: అభ్యర్థులు ఏప్రిల్ 12, 2022 నాటికి 21 నుంచి 27 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.
జీతం: ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ. 44,900 నుంచి రూ. 1,42,400 వరకు జీతం(7వ కేంద్ర పే కమిషన్ ప్రకారం) పొందుతారు.
అర్హతలు: నోటిఫికేషన్‌లో సూచించిన సంబంధిత సబ్జెక్ట్‌లో డిగ్రీని కలిగి ఉండాలి. కామర్స్ / లా / మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ప్లస్ కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం.
ఎంపిక విధానం: అభ్యర్థులు వ్రాత పరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్స్), నైపుణ్యాలు, వివరణాత్మక పరీక్షల ఆధారంగా ఎంపిక చేయబడతారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ESIC రిక్రూట్‌మెంట్ 2022 దరఖాస్తు రుసుము:
జనరల్ / OBC అభ్యర్థులకు: రూ. 500
SC / ST / PWD అభ్యర్థులకు: రూ.
ESIC రిక్రూట్‌మెంట్ 2022 కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: ఏప్రిల్ 12, 2022