ఉద్యోగాల భర్తీ పై కెసిఆర్ ప్రకటన మొత్తం 91,142 ఉద్యోగాల గుర్తింపు.
నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ భారీ గుడ్ న్యూస్ తెలిపారు. 91,142 పోస్టులును భర్తీ చేయనున్నట్లు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఈ రోజు నుంచే నోటిఫికేషన్లు ఇస్తామని వెల్లడించారు. పోలీస్ శాఖలో 18,334 ఖాళీలు, విద్యాశాఖలో 13,086, వైద్యరోగ్యశాఖలో 12,755, ఉన్నతవిద్యాశాఖలో 7,878 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. అటెండర్ నుంచి ఆర్డీవో వరకు స్థానికులకే ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటివరకు లక్షా 30 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు కేసీఆర్ చెప్పారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి గ్రూప్ 1, గ్రూప్ 2 ఖాళీలను భర్తీ చేయనున్నారు. గ్రూప్- 1 లో 503, గ్రూప్ -2లో 582, గ్రూప్-3లో 1373, గ్రూప్-4లో 9168 పోస్టులను భర్తీ చేయనున్నారు.జిల్లా స్థాయిలో 18,866, మల్టీజోన్‌లో 13,170 పోస్టులు, అదర్ కేటగిరి వర్సిటీలలో 8,174 పోస్టులు భర్తీ చేయనున్నారు.