Telangana అగ్నిమాపక శాఖలో 225 డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి(TSLPRB) శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నవారు ఈ ఉద్యోగానికి అర్హులు. ఐటీఐలో ఆటోఎలక్ట్రిషియన్, మెకానిక్ మోటార్ వెహికిల్, మోకానిక్ డీజిల్, ఫిట్టర్ ట్రేడ్లు పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు పురుషులు మాత్రమే అర్హులు కాగా వయోపరిమితి 21- 25 ఏళ్లగా నిర్ణయించారు. ప్రభుత్వం ఇచ్చిన ఐదేళ్ల వయోసడలింపు ఈ పోస్టులకు వర్తిస్తుంది. జోన్ల వారీగా భర్తీ చేసే ఉద్యోగాలకు దేహదారుఢ్య, రాత పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఈ పోస్టులకు శనివారం నుంచి ఈ నెల 26వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం TSLPRB వెబ్‌సైట్‌ను సందర్శించాలి. కాగా, పోలీసు నియామక మండలి గతంలో 17,291 పోస్టుల భర్తీకి సంబంధించి ఆరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ 225 డ్రైవర్ ఆపరేటర్ పోస్టులతో ఆ సంఖ్య 17,516కి చేరింది
నేటి నుంచి 26వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ