FCI RECRUITMENT 2022 Non Executive 5043 Posts Apply Now

FCI Recruitment  ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న ఎఫ్‌సీఐ డిపోలు, కార్యాలయాల్లో జోన్ల వారీగా కేటగిరీ-3 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ అప్లికేషన్స్​ కోరుతోంది.


కేటగిరీ-3 నాన్ ఎగ్జిక్యూటివ్: మొత్తం 5043 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో జూనియర్ ఇంజినీర్ (సివిల్ ఇంజినీరింగ్), జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజినీరింగ్), స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2, అసిస్టెంట్ గ్రేడ్-3(జనరల్), అసిస్టెంట్ గ్రేడ్-3(అకౌంట్స్‌), అసిస్టెంట్ గ్రేడ్-3(టెక్నికల్), అసిస్టెంట్ గ్రేడ్-3(డిపో), అసిస్టెంట్ గ్రేడ్-3(హిందీ) విభాగాలు ఖాళీగా ఉన్నాయి.

FCI RECRUITMENT 2022 NON Executive 5043 Posts Apply Now

జోన్ల వారీగా ఖాళీలు: నార్త్ జోన్ లో 2388 పోస్టులు, సౌత్ జోన్​లో 989, ఈస్ట్ జోన్ పరిధిలో 768, వెస్ట్ జోన్ లో 713, నార్త్‌ఈస్ట్‌ జోన్ పరిధిలో 185 ఖాళీగా ఉన్నాయి.


అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, బీకాం, బీఎస్సీ (అగ్రికల్చర్/ బోటనీ/ జువాలజీ/ బయో-టెక్నాలజీ/ బయో-కెమిస్ట్రీ/ మైక్రోబయాలజీ/ ఫుడ్ సైన్స్), బీఈ, బీటెక్‌ (ఫుడ్ సైన్స్/ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ/ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్/ బయో-టెక్నాలజీ/ సివిల్), డిప్లొమా (సివిల్/ మెకానికల్)/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.


సెలెక్షన్​: ఆన్‌లైన్ పరీక్ష (ఫేజ్-1, ఫేజ్-2 పరీక్షలు), స్కిల్/ టైపింగ్ టెస్ట్(స్టెనో పోస్టులకు) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ సిటీల్లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.


దరఖాస్తులు: అభ్యర్థులు రూ.500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది) అప్లికేషన్​ ఫీజు ఆన్​లైన్​లో సెప్టెంబర్ 6 నుంచి అక్టోబర్​ 5 వరకు చెల్లించాలి. ఆన్‌లైన్ పరీక్ష జనవరిలో ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్​సైట్​ www.recruitmentfci.in సంప్రదించాలి.