తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఉద్యోగాలకు సంబంధించి ఓ షార్ట్ వెబ్ నోటీస్ ను TSPSC విడుదల చేసింది. దీనిలో ఏఈఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలను పొందు పరిచారు.
దీనికి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ సెప్టెంబర్ 15 న విడుదల అవుతుందని ఆ నోటీస్ లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి అప్లికేషన్స్ (Applications) సెప్టెంబర్ 22 నుంచి మొదలవుతాయని.. అక్టోబర్ 14, 2022 వరకు దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 22 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన నియామక పరీక్ష డిసెంబర్ లేదా జనవరిలో ఉండే అవకాశం ఉంది. పూర్తి నోటిఫికేషన్ ను సెప్టెంబర్ 15వ తేదీన విడుదల చేయనున్నారు.
వయస్సు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ.54220 నుంచి రూ. 1,33,630 మధ్య చెల్లిస్తారు. పూర్తి వివరాలకు క్రింది లింక్ పై క్లిక్ చెయ్యండి.
CLICK HERE FOR PDF NOTIFICATION 👈