Staff Selection Commission స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పలు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
(SSC) స్టాఫ్ సెలక్షన్ కమీషన్ పే మ్యాట్రిక్స్ లెవెల్ 6లో ఇండియా మెటియోరోలాజికల్ డిపార్ట్‌మెంట్ (IMD)లో గ్రూప్ B పోస్ట్ ఆఫ్ సైంటిఫిక్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ కోసం ఓపెన్ కాంపిటీటివ్ పరీక్షను నిర్వహించాలని ప్రకటించింది.
దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వాతావరణ కేంద్రాల్లోని సైంటిఫిక్ అసిస్టెంట్(Scientific Assistant) గ్రూప్-'బి' నాన్-గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్ పోస్టులను భర్తీ చేస్తారు.ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 990 పోస్టులను భర్తీ చేస్తారు. (Website: https://ssc.nic.in)
• దరఖాస్తుల స్వీకరణ తేదీ అక్టోబర్ 18, 2022
• దరఖాస్తుల సవరణకు అవకాశం 25.10.2022
• రాత పరీక్ష డిసెంబరు, 2022 న నిర్వహిస్తారు
Education: సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ (భౌతికశాస్త్రం సబ్జెక్ట్‌లో ఒకటిగా)/కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా.. గుర్తింపు పొందిన సంస్థ/విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రానిక్స్ మరియు టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా తత్సమానం. ఇంటర్‌లో మ్యాథ్‌మెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు అర్హులు.
Age: 18-10-2022 నాటికి 30 ఏళ్లు మించకూడదు. అభ్యర్థి తప్పనిసరిగా 19-10-1992 కంటే ముందుగా మరియు 17-10-2004 కంటే తర్వాత జన్మించి ఉండకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ. 100. షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), బెంచ్‌మార్క్ దివ్యాంగులు (PwBD) మరియు మాజీ సైనికులు (ESM)కి చెందిన మహిళా అభ్యర్థులు ఫీజు NILL
(Website of the Commission: https://ssc.nic.in)