హోంశాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9212 ( (పురుషుల ఖాళీలు 9105, మహిళల ఖాళీలు 107 ) ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణులైన పురుష, మహిళా అభ్యర్థులు ఏప్రిల్ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 27 నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్లు ప్రారంభంకానున్నాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, డిటైల్డ్ మెడికల్ టెస్ట్, రివ్యూ మెడికల్ టెస్ట్‌ల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
పోస్టులు : కానిస్టేబుల్ (టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్)
పురుషుల పోస్టులు (9105) : డ్రైవర్, మోటార్ మెకానిక్ వెహికల్, కోబ్లర్, కార్పెంటర్, టైలర్, బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్, బగ్లర్, గార్డెనర్, పెయింటర్, కుక్, వాటర్ క్యారియర్, వాషర్‌మన్, బార్బర్, సఫాయి కర్మచారి తదితరాలు.
మహిళా పోస్టులు (107) : బగ్లర్, కుక్, వాటర్ క్యారియర్, వాషర్ ఉమెన్, హెయిర్ డ్రస్సెర్, సఫాయి కర్మచారి, బ్రాస్ బ్యాండ్ తదితరాలు.
అర్హతలు: పోస్టును బట్టి గుర్తింపు పొందిన బోర్డు/ విశ్వవిద్యాలయం నుంచి పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణత, హెవీ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. దీంతోపాటు నిర్ధిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ( పురుషులు 170 సెం.మీ., మహిళలు 157 సెం.మీ. ఎత్తు) 18 నుంచి 23 మధ్య వయస్సు వారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, డిటైల్డ్ మెడికల్ టెస్ట్.
అప్లికేషన్ ఫీజు: రూ.100, SC, ST, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: Online
దరఖాస్తులు ప్రారంభం: March 27th 2023
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25th April
పరీక్ష: జూన్ 20 నుంచి 25 మధ్య
వెబ్‌సైట్: www.crpf.nic.in