TSLPRB ఈ నెల 11న టెక్నికల్ SI, ASI పోస్టులకు మెయిన్స్ పరీక్ష జరగనుంది.
పోలీస్ నియామక ప్రక్రియ చివరిదశకు చేరుకున్నది. ఇప్పటికే ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఫిజికల్ పరీక్షలను పూర్తిచేసిన పోలీస్ ఉద్యోగాల నియామక బోర్డు టీఎస్‌ఎల్‌పీఆర్బీ (TSLPRB) తాజాగా టెక్నికల్ ఎస్‌ఐ, ఏఎస్‌ఐ (ఎఫ్‌పీబీ) పోస్టులకు మెయిన్స్ ఎగ్జామ్ తేదీలను ప్రకటించింది. ఈ నెల 11న ఎస్‌సీడీ ఎస్‌ఐ (Information Technology & Communications Organization) అభ్యర్థులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు, ఏఎస్‌ఐ (ఎఫ్‌పీబీ) అభ్యర్థులకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు తుది పరీక్షను హైదరాబాద్‌లోని కేంద్రాల్లో నిర్వహించనుంది.
అర్హులైన అభ్యర్థులు ఈ నెల 8 నుంచి 9వ తేదీ అర్ధరాత్రి వరకు TSLPRB వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసేప్పుడు ఏదైనా సమస్య తలెత్తినట్లయితే support@tslprb.in కు మెయిల్ లేదా 9393711110, 9391005006 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నది. కాగా, మిగిలిన రెండు పరీక్షలకు సంబంధించిన తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపింది.