TREI-RB TGT Recruitment 2023 Apply Online 4006 Posts

తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూటషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (TREI RB) 4,006 Trained Graduate Teacher (TGT) ఉద్యోగాల భర్తీకి పూర్తి నోటిఫికేషన్ ను జారీ చేసింది.

తెలంగాణ రెసిడెన్షియల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలో గల టీజీటీ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

మొత్తం ఖాళీలు : 4,006

  1. తెలుగు – 488
  2. సంస్కృతం – 25
  3. హిందీ – 516
  4. ఉర్ధూ – 120
  5. ఇంగ్లీష్ – 681
  6. గణితం – 741
  7. బయోలాజికల్ సైన్స్ – 327
  8. ఫిజికల్ సైన్స్ – 431
  9. జనరల్ సైన్స్ – 98
  10. సోషల్ స్టడీస్ – 579


  • దరఖాస్తు ప్రక్రియ : ఆన్లైన్ ద్వారా
  • దరఖాస్తు గడువు : ఎప్రిల్‌ – 28 నుండి మే 27 సాయంత్రం 5 గంటల వరకు
  • దరఖాస్తు ఫీజు : 1,200/- (SC, ST, BC, EWC, PH – 600/-)
  • వయోపరిమితి : 18 – 44 ఏళ్ల మద్య ఉండాలి. జూలై – 01 – 2023 నాటికి (రిజర్వేషన్లు అనుసరించి సడలింపు కలదు)
  • అర్హతలు : బ్యాచిలర్ డిగ్రీ 50% మార్కులతో (SC, ST, BC, PH లకు 45% మార్కులు) మరియు బీఈడీ చేసి ఉండాలి. TS TET, APTET, CTET అర్హత సాదించి ఉండాలి.


పరీక్ష విధానం : మొత్తం 3 పేపర్లు 300 మార్కులకు ఉండనున్నాయి.

పేపర్ – 1: (జనరల్ స్టడీస్, ఎబిలిటీస్ & బేసిక్ ప్రొపిషియన్సీ ఇన్ ఇంగ్లీషు) (తెలుగు & ఇంగ్లీషు మీడియం) – 100 మార్కులు

పేపర్ – 2 : సంబంధించిన సబ్జెక్టు పెడగాగి – 100 మార్కులు

పేపర్ – 3 : సంబంధించిన సబ్జెక్టు స్థాయిలో – 100 మార్కులు.


TRAINED GRADUATE TEACHERS IN RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS SOCIETIES (GENERAL RECRUITMENT)


దరఖాస్తు విధానం ఇలా..

Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ https://treirb.telangana.gov.in/index.phpను ఓపెన్ చేయాలి.

Step 2: హోం పేజీలో Apply Online/ One Time Registration (OTR) అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 3: అనంతరం కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో New Registration (OTR)? అనే ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.

Step 4: ఫస్ట్ మీ ఆధార్ వివరాలను నమోదు చేయాలి.

Step 5: తర్వాత సూచించిన ఇతర వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

Step 6: తర్వాత హోం పేజీలో కనిపించే Apply Online ఆప్షన్ పై క్లిక్ చేసి ఓటీఆర్ నంబర్ తో  లాగిన్ అవ్వాలి.

Step 7: అక్కడ మీ వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.. చివరగా భవిష్యత్ అవసరాల కొరకు మీ అప్లికేషన్ ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి.