TREIRB Recruitment 2023 | 9231 Vacancies in different educational institutions

తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్సిటిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు (TREI – RB) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న 9,231 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.


బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల విద్యాల‌యాల సొసైటీ ప‌రిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ ప్రభుత్వం చ‌ర్యలు చేప‌ట్టింది. ఈ మేర‌కు తెలంగాణ గురుకుల విద్యాల‌యాల సంస్థ రిక్రూట్‌మెంట్ బోర్డు (ట్రిబ్‌) క‌న్వీన‌ర్ నోటిఫికేష‌న్ జారీ చేశారు. ఆయా పోస్టుల భ‌ర్తీకి సంబంధించి 12వ తేదీ నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నుంది.

TREIRB Recruitment 2023 | 9231 Vacancies in different educational institutions

ఏప్రిల్ 12 నుండి అధికారిక వెబ్సైట్ లో తమ వివరాలు గురుకుల వెబ్సైట్ లో (OTR చేసుకోవాలి)

వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుని, దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.


1) గురుకుల డిగ్రీ కళాశాల లో లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ 868 పోస్టులకు ఈ నెల 17 నుండి వచ్చే నెల ( మే నెల) 17 వరకు ఆప్లికేషన్ స్వీకరణ


2) గురుకుల జూనియర్ కాలేజిల్లో 2008 పోస్టులకు ఈ నెల 17 నుండి వచ్చే నెల 17 వరకు అప్లికేషన్స్ స్వీకరణ


3) పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ PGT లో 1276 పోస్టులకు ఈ నెల 24 నుండి వచ్చే నెల 24 వరకు ఆప్లికేషన్స్ స్వీకరణ


4) గురుకుల స్కూల్స్ లైబ్రేరియన్ 434 పోస్టులకు ఈ నెల 24 నుండి వచ్చే నెల 24 వరకు అప్లికేషన్స్ స్వీకరణ


5) గురుకుల స్కూల్స్ ఫిజికల్ డైరెక్టర్ 275 పోస్టులకు ఈ నెల 24 నుండి వచ్చే నెల 24 వరకు అప్లికేషన్స్ స్వీకరణ


6) గురుకుల డ్రాయింగ్ ఆర్ట్ 134 పోస్టులకు ఈ నెల 24 నుండి వచ్చే నెల 24 వరకు అప్లికేష్లన్స్ స్వీకరణ


7) గురుకుల క్రాఫ్ట్స్ టిచర్  92 పోస్టులకు ఈ నెల 24 నుండి వచ్చే నెల 24 వరకు


8) గురుకుల స్కూల్స్ మ్యూజిక్ టిచర్ 124 పోస్టులకు ఈ నెల 24 నుండి వచ్చే నెల 24 వరకు* 


9) ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ TGT 4020 పోస్టులకు ఈ నెల 28 నుండి వచ్చే నెల 27 వరకు అప్లికేషన్స్ స్వీకరణ ప్రక్రియ.


*జోనల్ వైజ్ పోస్టులు, క్వాలిఫికేషన్స్, పరీక్ష తేదీలు లు ఈ నెల 17, 24, 28 తేదీల్లో వెలువడే ఆయా విభాగాల నోటిఫికేషన్స్ లో పేర్కొననున్నారు.


*తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇది 3 వ నోటిఫికేషన్..


 *2016 లో 12 వేల గురుకుల  పోస్టులకు TSPSC నోటిఫికేషన్ జారీ చేసారు.3 పేపర్ల విధానం లో ప్రిలిమ్స్ 1 పేపర్,  మెయిన్స్ 2 పేపర్ల రూపం లో పరీక్షలు నిర్వహించారు. 2018 లో గురుకుల బోర్డ్ 4 వేల పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రిలిమ్స్ మెయిన్స్ కాకుండా ఒకే విధానం లొ 3 పేపర్లతో పరీక్షలు నిర్వహించినారు.*


*TGT కి టెట్ పేపర్ 2 లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. రాష్ట్ర లేదా కేంద్ర టెట్ ఏదైన ఉండాలి. 20% మార్కులు TGT లో టెట్ వేయిటేజి ఉంటుంది.



దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు ప్రారంభ తేదీ : ఎప్రిల్ 12 నుంచి

◆ వెబ్సైట్ : www.treirb.telangana.gov.in