Role of Organizations, Meetings in 1969 Telangana Movement - 1969 ఉద్యమంలో వివిధ సంస్థలు సదస్సులు వాటి పాత్ర.
ఉస్మానియా ప్రొఫెసర్ల సదస్సు(OU Professors Meeting)
May 20న ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్లు, లెక్చరర్లు తెలంగాణ సదస్సును నిర్వహించారు.
దీనికి అధ్యక్షత వహించింది ప్రొఫెసర్ మంజూర్ ఆలం.
ఈ సదస్సులో ప్రొఫెసర్ జయశంకర్ గారు "డాక్టర్ K.L. రావు - నాగార్జున సాగర్" అనే పత్రాన్ని వారు సమర్పించారు.
ఈ సదస్సులలో వివిధ ప్రొఫెస్సర్లు మరియు లెక్చరర్లు సమర్పించిన పత్రాలన్నింటినీ కలిపి (Telangana Movements & Investigative Focus) "తెలంగాణ మూవ్మెంట్ అండ్ ఇన్వెస్టిగేషన్" అనే పుస్తకాన్ని ప్రచురించారు.
1969 తెలంగాణ ఉద్యమంలో మహిళలు కూడా తమ వంతు పాత్రను పోషించారు.
వారిలో ముఖ్యులు - T.M. సదాలక్ష్మి, శాంతాబాయి, ఈశ్వరీబాయి, సంఘం లక్ష్మీబాయమ్మ
వీరు JUNE 17న "తెలంగాణ మహిళా దినం" (Telangana Women's Day) ను నిర్వహించారు.
Meeting by OSMANIA UNIVERSITY Professors in 1969 Telangana Movement |
ఉద్యమ విరమణ (Withdrawal of 1969 Movement)
ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో మర్రి చెన్నారెడ్డి గారు, ఇందిరాగాంధీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని ఉద్యమాన్ని విరమించారు.
SEPTEMBER 23 న విద్యార్థులు తరగతులకు హాజరు కావాలని తెలంగాణ ప్రజా సమితి మరియు విద్యార్ధుల కార్యాచరణ సమితి ప్రకటించింది.
మర్రి చెన్నారెడ్డి గారు రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని "తెలంగాణ ప్రజా సమితిని" రాజకీయ పార్టీగా మార్చారు.
1971 పార్లమెంట్ ఎన్నికల్లో 14 లోక్ సభ స్థానాల్లో తెలంగాణ ప్రజా సమితి 10 లోక్ సభ స్థానాలను కైవసం చేసుకుంది.
చెన్నారెడ్డి, ఇందిరా గాంధీ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం కాసు బ్రహ్మానంద రెడ్డిచే రాజీనామా చేయించిన తరువాత తెలంగాణ ప్రాంతానికి చెందిన పి.వి. నరసింహారావు 1971 సెప్టెంబర్ 30 న (Chief Minister) ముఖ్యమంత్రిగా నియమించారు.
For Job Notifications CLICK HERE TSPSC WEBSITE CLICK HERE