Ikshvaku Dynasty Study Material in Telugu
- ఇక్ష్వాకుల రాజ్య స్థాపకుడు శాంతమూలుడు
- వీరియొక్క రాజధాని విజయపురి
- ఇక్ష్వాకుల రాజ చిహ్నం సింహం
- ఎహువల శాంతమూలిడి కాలం నుంచి శాసనాలు సంస్కృతంలో వేయబడినవి
- వీరికాలం నుంచి మేనత్త కూతుళ్లను వివాహం చేసుకునే సంప్రదాయం మొదలైంది
- పురాణాల ప్రకారం ఇక్ష్వాకులలో 7 గురు పాలకులు ఉన్నారు. కాని ఇక్ష్వాకుల శాసనాల ప్రకారం నలుగురు మాత్రమే ఉన్నారు
- వీరి పరిపాలన కాలం సుమారు 100 సం. లు
వశిస్థిపుత్ర శాతకర్ణి (క్రీ.శ.220-233)
- ఇతను స్వతంత్ర ఇక్ష్వాక రాజ్య స్థాపకుడు
- పూగియ, హిరణ్యక వంశీయులతో కలిసి శాతవాహన రాజు 3వ పులోమావిని తొలిగించి స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాడు
- ఇతనికి 'మహారాజ' అనే బిరుదు కలదు, ఇంకా శతసహస్త్రదానప్రదాత అనే బిరుదు పొందాడు
- ఇతను వైదిక మతాన్ని ఆచరించాడు
- ఇతను అనేకమైన శాసనాలు వేయించాడు(రెంటాల, దాచేపల్లి, కేశానాపల్లి)
- ఇతని భార్య మఠారిశ్రీ, కూతురు అటవి శాంతిశ్రీ, కుమారుడు వీరపురుష దత్తుడు, సోదరిణులు శాంతశ్రీ మరియు హార్మశ్రీ.
మఠరీపుత్ర శ్రీ వీరపురుషదత్తుడు (క్రీ.శ.233-253)
- ఇతను శాంతమాలుడు కుమారుడు, తలి పేరు మాధురి
- ఇతను ఇక్ష్వాక వంశంలో గొప్పవాడు
- నాగార్జునకొండ శాసనాన్ని అనుసరించి ఇతనికి ఐదుగురు భార్యలు ఉన్నారు
- ఇతను తన మేనత్త హార్మశ్రీ ఇద్దరి కూతుళ్లను (బాపిశ్రీ, షష్ఠిశ్రీ ) వివాహమాడాడు ఇంకా ముగ్గురు భార్యల పేర్లు -- బట్టీ మహాదేవి, రుద్రా భట్టారిక మరియు శాంతశ్రీ.
- ఇతను మొదట్లో వైదిక మతాన్ని అనుసరించాడు తరువాత బౌద్ధమతాన్ని స్వీకరించాడు
- నాగార్జునకొండలోనే ఒక శిల్పంలో రాజు తన కుడి కాలుతో 'శివలింగాన్ని' తాకుతున్నట్లు ఉంది
- ఇతని ఏకైక కూతురు కొడబలిశ్రీ
- ఇతని కాలంలో 'ఉపశక బోధిశ్రీ' అనే మహిళ బౌద్ధమత వ్యాప్తికి కృషిచేసింది
- ఇతని యొక్క శాసనాలు -- అల్లూరిశాసనం, ఉప్పుగుండూరు శాసనం, నాగార్జునకొండ శాసనం, అమరావతి శాసనం మరియు జగ్గయ్యపేట శాసనం.
ఎహువల శాంతమూలుడు (క్రీ.శ.253-277)
- ఇతనిని రెండవ శాంతమూలుడు అంటారు
- తాతపేరు పెట్టుకునే సంప్రదాయం ఇక్ష్వాకుల నుంచే మొదలైంది.
- ఇతను వైదిక బౌద్ధ మతాలను ఆచరించాడు
- ఇతని కాలంనుంచే శాసనాలు "సంస్కృతం" లో చెక్కబడ్డాయి
- ఇతను దక్షిణభారత దేశంలో హిందూ దేవాలయాలను నిర్మించిన మొట్టమొదటి రాజు
- అప్పట్లో మహిళలు సంతానం కొరకు "హరిత దేవత" కు గాజులు సమర్పించేవారు
- ఇటీవల కాలంలో "గుమ్మడూరు" వద్ద ఎహువల శాంతమూలుడు యొక్క శాసనం లభించింది దీనిలో బౌద్ధ విద్యాలయానికి సంబందించిన వివరాలు ఉన్నాయి.
- ఇతను నిర్మించిన దేవాలయాలు
- పుష్పభద్ర నారాయణస్వామి దేవాలయం (విజయపురిలో)
- కార్తికేయని దేవాలయం (విజయపురిలో)
- నవగ్రహ ఆలయం (నాగార్జున కొండలో)
- కుబేర ఆలయం (నాగార్జున కొండలో)
రుద్రపురుషదత్తుడు (క్రీ.శ.283-301)
- ఇతను ఇక్ష్వాకుల చివరి పాలకుడు
- ఇతని కాలంలోనే తోలి పల్లవ రాజులూ ఇక్ష్వాకుల రాజ్యంపై దాడులు చేసారు
- దీని గురుంచి సింహవర్మ వేయించిన "మంచికల్లు శాసనం" లో పేర్కొనబడింది . ఇది ఆంధ్రదేశంలో పల్లవుల తోలి శాసనం
- ఇక్ష్వాకుల కాలంలో నాగార్జునకొండ మంచి వర్తక కేంద్రంగా అభివృద్ధి చెందింది
- శ్రీలంక రాజులూ వారి బౌద్ధ సన్యాసుల కోసం 'నాగార్జున కొండ' వద్ద 'సింహళ విహారము' ను నిర్మించారు
- నాగార్జునకొండ ప్రసిద్ధ విశ్వవిద్యాలయం గా మారింది
- వీరికాలంలో అమరావతి శిల్పకళా పూర్తిగా వికసించింది
- వీరికాలంలో సంగమ వంశం కు చెందిన 'విరుగల్' అనే సంప్రదాయం మొదలైంది
- విరుగల్ అంటే 'రాజు కోసం జీవించి రాజు కోసం మరణించే అంగరక్షకులు'
- వీరి కాలం నుంచే శాసనాలపై సంవత్సరాలు ప్రస్తావించే సంప్రదాయం మరియు నిర్మాణాలపై శిల్పుల పేర్లు చెక్కడం ప్రారంభమైంది
- వృత్తిపన్ను విధించబడినట్లుగా 'విషవత్తి శాసనం' ద్వారా తెలుస్తుంది.