పంచ సూత్ర పథకం - 1971 Five Point Formula in Telangana Movement
మర్రి చెన్నారెడ్డి 1971 OCTOBER లో 10 మంది ప్రజా సమితి పార్లమెంటు సభ్యులతో సహా తెలంగాణ ప్రజా సమితిని కాంగ్రెస్ లో కలిపారు సెంటిమెంట్ తో గెలిపించిన తెలంగాణ ప్రజలను ముంచేశారు.
దీంతో తెలంగాణవాదుల్లో అసంతృప్తి రగిలింది దీనిని చల్లార్చడానికి ఇందిరాగాంధీ పంచ సూత్ర పథకం రూపొందించింది
1971 పంచ సూత్ర పథకం:
1. ముల్కీ నియమాలు తెలంగాణ ప్రాంతంలో నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు, తహసీల్దారు, అసిస్టెంట్ సర్జన్, జూనియర్ ఇంజనీర్ పదవులకు వర్తిస్తాయి మరియు సచివాలయం శాఖాధిపతుల కార్యాలయాల్లో ప్రతి మూడు ఉద్యోగాల్లో ఒక ఉద్యోగానికి కూడా వర్తిస్తాయి.
2. ఈ రక్షణలు రాజధాని నగరమైన హైదరాబాద్ లో 1977 సంవత్సరం చివరి వరకు మిగతా తెలంగాణ జిల్లాలలో 1980 సంవత్సరం చివరి వరకు అమలు జరుగుతాయి.
3. ఉభయ ప్రాంతాల్లో ఉద్యోగులకు తగిన ప్రమోషన్ అవకాశాలు కల్పించడానికి వివిధ ఉద్యోగాలను మొదటి లేక రెండవ గెజిటెడ్ స్థాయి వరకు ప్రాంతీయ చేయడం జరుగుతుంది. ఈ సూత్రాలు ఏవి కూడా ఆలిండియా సర్వీసెస్ కు కానీ, ప్రమోషన్ దొరికిన తక్షణ క్రింది పదవులకు గాని వర్తించవు.
4. సాంకేతిక, వృత్తి పరమైన విద్యాలయాల తో సహా నగరంలోని అన్ని విద్యాలయాల్లో ప్రస్తుతం తెలంగాణ ప్రాంత విద్యార్థులకు లభించే స్థానాల కంటే అదనంగా కొన్ని స్థానాలు సృష్టించడం జరుగుతుంది. కొత్తగా సృష్టించిన స్థానాలను బేషరతుగా ఏ ప్రాంతం వారైనా పొందవచ్చు.
5. జంటనగరాల్లో ఆంధ్ర, తెలంగాణ రెండు ప్రాంతాలకు చెందిన ఉమ్మడి పోలీసు బలగాలు ఉంటాయి. దీనికి సంబంధించిన వివరాలను రూపొందించిన తర్వాత అందుకు అవసరమైన శాసనం రూపొందుతుంది.
NOTE: పస లేని ఈ పంచ సూత్ర పథకం తెలంగాణ వాదులను సంతృప్తి పరచలేదు. ఇది నామమాత్రపు పథకం గానే మిగిలింది అసలు ఈ పథకం అమలులోకి రాలేదు.
For Job Notifications CLICK HERE TSPSC WEBSITE CLICK HERE