1973 President Rule in Andhra Pradesh - రాష్ట్రపతి పాలన

రాష్ట్రపతి పాలన (President Rule in Telangana Allegations) 

  • జై ఆంధ్ర ఉద్యమం వల్ల 1973 January 17న పీవీ నరసింహారావు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు. 
  • 1973 జనవరి 18న ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన ప్రారంభమైన 1973 December 10 వరకు కొనసాగింది. 
  • ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నర్ ఖండూ బాయ్ దేశాయి 
  • ఇతని సలహాదారులు 1) వి కె  రావు 2) H C శరీన్  
  • ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కొరకు ఆంధ్రా నాయకులు March 18, 1973 చిత్తూరులో సమావేశమయ్యారు 
  • ఈ మధ్య కాలంలోనే February 16, 1973 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు మరో తీర్పునిచ్చింది 
  • ఈ తీర్పులో తెలంగాణలో పుట్టి పెరిగిన వారు మాత్రమే ముల్కీలు కాదని ఇక్కడ స్థిరనివాసం ఏర్పరచుకున్న వారు కూడా ముల్కీలు అనే తీర్పు ఇచ్చింది 
  • ఈ తీర్పు తెలంగాణ వారి ఉద్యోగ అవకాశాలను గండి కొట్టినట్లయింది. దీనితో ఈ ప్రాంతంలో ఆందోళన ప్రారంభమైనది. 
  • ఇది ఇలా కొనసాగుతూ ఉండగానే July 11, 1973 న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరో తీర్పునిస్తూ ముల్కీ నిబంధనలు నేరుగా జరిగే నియామకాల సమయంలో మాత్రమే వర్తిస్తాయి అవి పదోన్నతి విషయాలలో కాదని తీర్పునిచ్చింది.  
  • ఈ తీర్పుల పర్యవసానంగా కాలగమనంలో 2 ప్రాంతాలలో ఆందోళనలు తగ్గే సమయం వచ్చింది 
  • ఇరు ప్రాంతాల వారిని దృష్టిలో ఉంచుకొని ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ఆరు సూత్రాల పథకంను తీసుకువచ్చింది.
For Job Notifications CLICK HERE      TSPSC WEBSITE CLICK HERE