1975 Presidential Order Article 371-D

371-డి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ (రాష్ట్రపతి ఉత్తర్వులు) -1975 Article 371-D - 1975 Presidential Order


భారతదేశంలోని వెనుకబాటు తనానికి అల్పాభివృద్ధి కి గురిఅయిన రాష్ట్రాలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించేందుకు 371వ నిబంధనలు రాజ్యాంగంలో చేర్చారు 

371-D (Article 371-D) అనేది ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రత్యేక నిబంధన. దీనికోసం 32 వ రాజ్యాంగ సవరణ చేసి దీనిని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది 

371-D (Article 371-D) ప్రకారం రాష్ట్రపతికి ఆంధ్రప్రదేశ్ కు  సంబంధించిన కొన్ని అధికారాలు  కల్పించారు. ఈ అధికారాల ఆధారంగానే రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయ్యాయి 


1. రాష్ట్రపతి 1975 October 18న రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. దీనినే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటారు 

2. రాష్ట్ర ప్రభుత్వం 1975 October 20న జీవో 674 ను జారీ చేసింది 

3. జీవో 674(G.O. 674) అనేది ఉద్యోగ నియామకాలలో పాటించాల్సిన అంశాలను నిర్దేశించింది 

4. ఈ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రాన్నిఆరు జోన్లుగా విభజించారు 


ఆంధ్ర ప్రాంతం 3 జోన్లు 

ఒకటవ జోన్: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 

రెండవ జోన్: తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ 

మూడవ జోన్:  గుంటూరు, ప్రకాశం, నెల్లూరు 


రాయలసీమ ఒక జోన్ 

నాలుగవ జోన్: కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు 


తెలంగాణ రెండు జోన్లు 

ఐదవ జోన్: వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం 

ఆరవ జోన్: మెదక్, హైదరాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ


For Job Notifications CLICK HERE      TSPSC WEBSITE CLICK HERE