శాతవాహనుల యుగం - తొలి శాతవాహనులు
శాతవాహన రాజ్యస్థాపకుడు - శ్రీముఖుడు
అందరికంటే గొప్పవాడు - గౌతమీ పుత్ర శాతకర్ణి
చివరి గొప్పవాడు - యజ్ణశ్రీ శాతకర్ణి
శ్రీముఖుడు(క్రీ.పూ.231-208) :
ఇతను శాతవాహన రాజ్యస్థాపకుడు
ఇతనిని పురాణాలు సింథకుడు, బలపుచ్ఛకుడు, బలి అని పేర్కొన్నాయి.
ఇతని పరిపాలన కాలం 23 సంవత్సరములు.
ఇతను మొదటగా జైన మతాన్ని స్వీకరించి చివరికి వైదిక మతాన్ని ఆచరించాడు.
ఇతని నాణెముల మీద 'సిరి చిముక', 'సిరి చిముక శాతవాహన', 'సిరి శాతవాహన' అనే 3 పేర్లు ఉన్నాయి.
ఇతను రాఠీకులు అనే నాగా జాతి తెగను ఓడించి వారితో వివాహసంబందాలు ఏర్పరుచుకున్నాడు.
ఇతని కుమారుడు 1వ శాతకర్ణి.
కృష్ణుడు :
ఇతను శ్రీముఖుని సోదరుడు
ఇతని పరిపాలన కాలం 18 సం.
ఇతని 'నాసిక్' శాసనం లో శాతవాహన పాలనా పద్దతి మరియు మౌర్యుల విధానంలో తీర్చిదిద్దినట్లు తెలుస్తుంది.
ఇతడు నాసిక్ గుహలను తొలిపించాడు. నాసిక్ లో బౌద్ధ సన్యాసుల క్షేమం కొరకు ధర్మమహాత్య అనే అధికారులను నియమించాడు. 'భాగవత' మతం ఇతనికాలంలో దక్షిణభారతదేశానికి వ్యాప్తి చెందింది.
మొదటి శాతకర్ణి :
ఇతను శ్రీముఖుని కుమారుడు.
ఇతని పరిపాలన కాలం 18 సం.
ఇతని భార్య పేరు నాయనిక (నాగానిక), ఈమె వేయించిన శాసనం పేరు నానేఘాట్, దీనిపై వీరి కుమార్తె మహారతి త్రణకయిరో, కుమారులు కుమార హకుశ్రీ, కుమార శాతవాహన, వెదిశ్రీ(పెద్ద కుమారుడు) ల ప్రతిమలు ఉన్నాయి.
ఇతను 2 అశ్వమేఘ యాగాలు, ఒక రాజసూయ యాగం, 20 క్రతువులను నిర్వహించాడు.
ఇతని బిరుదులు - అప్రతిహతచక్ర, ఏకవీర, దక్షిణ పథపతి.
'గజ' గుర్తు గల నాణేలను ముద్రించాడు.
పురాణాలూ ఇతడిని 'మహాన్', 'మల్లకర్ణ' అని పేర్కొన్నాయి.
ఇతను 'ఉజ్జయిని పట్టణ' గుర్తుతో నాణేలు ముద్రించాడు.
ఇతని సమకాలీన పాలకులు
పుష్యమిత్రశుంగుడు - మగద
ఖారవేలుడు - కళింగ
డెమిత్రియస్ - ఇండో గ్రీకు
ఇతను కళింగ ఖారవేలుడు పై దండెత్తినట్లు 'ఛుళ్ళా కళింగ జాతక' ద్వారా తెలుస్తుంది.
ఇతను తొలిసారిగా బ్రాహ్మణులకు పన్ను మినహాయింపు భూములను దానంగా ఇచ్చాడు.
వైవాహిక సంబంధాల ద్వారా రాజ్య విస్తరణ చేశాడు.
ఇతని భార్య నాగానిక తండ్రి పేరు మహారథకైరో (రాతికుల రాజు).
2వ శాతకర్ణి
పురాణాల ప్రకారం ఇతను 6వ రాజు
ఇతని పరిపాలన కాలం 56 సం.
ఇతను 'సాంచీ' స్థూపానికి దక్షిణ తోరణం నిర్మించాడు. 'ఆనందుడు' దక్షిణ తోరణం పై శాసనాన్ని చెక్కించాడు.
ఉత్తర భారతదేశంలో రాజ్య(పాలన) విస్తరణ చేసిన మొదటి దక్షిణ భారతదేశ రాజుగా పేర్కొంటారు.
ఇతని తరువాత లంబోదరుడు,అపీలకుడు, మేఘస్వాతి, స్వాతి, స్కందస్వాతి, మృగేంద్ర స్వాతి కర్ణి, కుంతల శాతకర్ణి, స్వాతి కర్ణి, అనే 8 మంది రాజులు పాలించారు.
అపీలకుడు పరిపాలన కాలం 12 సం. పురాణాల ప్రకారం ఇతని పరిపాలన కాలం 8 వ రాజు
కుంతల శాతకర్ణి :
ఇతని బిరుదు విక్రమార్క
పురాణాల ప్రకారం ఇతను 13వ రాజు
ఇతని ఆస్థానంలో శర్వవర్మ 'కాతంత్ర వ్యాకరణం' ను సంస్కృతంలో రచించాడు.
ఇతని ఆస్థానంలో అభివృద్ధి చెందినది
కుంతల శాతకర్ణికి 6 నెలల్లో సంస్కృతం నేర్పించింది శర్వవర్మ .
పైశాచిక భాషలో 'బృహత్కథ ను ఇతని ఆస్థానంలో రచించింది గుణాధ్యుడు.
ఇతని భార్య పేరు మలయావతి. ఈమె 'కరిర్త' అనే రతి భంగిమ కారణంగా మరణించింది.
కుంతలా శాతకర్ణి గురించి ఈ క్రింది గ్రంథాలలో పేర్కొనబడింది
1. వాత్సాయ కామ సూత్రం. (దీనిని తెలుగులోకి అనువాదం చేసినది పంచాంగుల నారాయణ శాస్త్రి )
2. రాజశేఖరుడి కావ్య మీ మాంస
3. గుణాఢ్యుడి బృహత్కథ
ఇతని తరువాత స్వాతి కర్ణి పరిపాలించాడు.
1 వ పులోమావి :
ఇతను 15వ రాజు ఇతను చెందిన సుశర్మను ఓడించి మగధను 10 సం. లు పరిపాలించాడని వాయు పురాణం పేర్కొంది.
పులోమావి ' గడ్డిలో జన్మించినవాడు' అని అర్థం.
ఇతని తరువాత పాలకుడు శివస్వాతి.
హాలుడు:
శాతవాహన చక్రవర్తులలో 17వ రాజు
ఇతను సరస్వతాభిమాని, సాహితీవేత్త
ఇతని బిరుదు కవి వత్సలుడు,
'బాణుడు' తన హర్షచరిత్రలో గాదా సప్తశతిని హాలుడు రచించాడని పేర్కొన్నాడు.
ఇతని భార్య పేరు లీలావతి
ఇతని వివాహంపై 'కుతూహలుడు' "లీలావతి పరిణయం" ను రచించాడు.