శాతవాహనుల యుగం - మలి శాతవాహనులు
గౌతమీపుత్ర శాతకర్ణి(క్రీ.శ. 106-130) :
ఇతను శాతవాహనులందరిలో గొప్పవాడు. ఇతని పరిపాలన కాలం 24 సం.లు
క్రీ.శ. 78 లో శాలివాహన యుగం ప్రారంభించాడు.
ఇతని తండ్రి పేరు శివ స్వాతి. తల్లి పేరు గౌతమీ బాలశ్రీ . ఈమె తన పుత్రుడి మరణాంతరం అతని గొప్పతనాన్ని వివరిస్తూ "నాసిక్" శాసనం వేయించింది.
ఇతని యొక్క బిరుదు - త్రిసముద్ర పీతవాహన
ఇతను శకులను, పల్లవులను, యవనులను ఓడించాడు. ఇతను క్షాత్రప వంశాన్ని నిర్ములించాడు.
ఇతనికాలంలోనే తెలుగు ప్రాంతం మొత్తం ఆదీనంలో ఉంది.
ఇతని కాలం నుండే రాజులు తల్లుల పేర్లు తమ పేర్లతో జోడించుకొనే సంప్రదాయం మొదలైంది.
ఇతను నాసిక్ దగ్గర 'జోగల్ తంబీ' అనే యుద్ధంలో శక రాజు 'సహఫానుణ్ణి' ను ఓడించి ఆతను ముద్రించిన వెండి నాణేలను సేకరించి మరల తన చిహ్నాలతో వాటిని పునః ముద్రించాడు.
ఇతని కాలం లో రాజ్యం బాగా విస్తరించింది.
ఇతను వైదిక మాత సంప్రదాయాలను పాటిస్తూనే బౌద్ధ మతాన్ని కూడా ఆచరించాడు.
2వ పులోమావి / వాశిష్ఠపుత్ర శాతకర్ణి :
ఇతను గౌతమీపుత్ర శాతకర్ణి కుమారుడు
ఇతని రాజధాని ధాన్యకటకం. ఇతని పరిపాలన కాలంలో 'నాసిక్' శాసనం వేయించబడింది.
ఇతని యొక్క బిరుదు నవనాగరా స్వామి
ఇతని కాలంలోనే ప్రఖ్యాత అమరావతి స్థూపం నిర్మించబడించి. దీనిని స్థానిక రాజు "వీలుడు" లేదా 'నాగరాజు' నిర్మించాడని పేర్కొంటారు.
రుద్రదాముడు వేయించిన శాసనం పేరు - జునాఘడ్, దీనిలో శాతకర్ణిని 2 సార్లు ఓడించినట్లు పేర్కొన్నాడు. ఇది సంస్కృతంలో వేయించిన మొదటి శాసనం.
ఇతను కార్లెలో బౌద్ధ సన్యాసులకు విరాళాలు ఇచ్చాడు.
ఇతని ఆస్థానంలోని 'టాలమీ' ఉన్నాడు. ఇతను భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇతను రాసిన గ్రంధం Guide to Geography "గైడ్ టు జాగ్రఫీ ".
వాశిష్ఠ పుత్ర శివ శ్రీ శాతకర్ణి:
ఇతను కూడా గౌతమీపుత్ర శాతకర్ణి కుమారుడు
ఇతను రుద్రదాముని కుమార్తెను వివాహం చేసుకున్నాడు.
ఇతను పాకృతం మరియు తమిళం 2 భాషలతో నాణెములను ముద్రించిన తొలి శాతవాహన రాజు
ఇతని బిరుదు క్షత్రప.
యజ్ణశ్రీ శాతకర్ణి(క్రీ.శ. 165-194)
ఇతను పురాణాల ప్రకారం 26వ రాజు. శాతవాహనులలో చివరి గొప్పవాడు.
ఇతను అనేక యజ్ఞాలు చేసి ఈ పేరు పొందాడు.
ఇతను రెండు తెరచాపలున్న ఓడ బొమ్మ లేదా లంగరు వేసిన ఓడ చిహ్నంతో నాణేలు ముద్రించాడు.
ఇతని కాలంలోనే మత్స్య పురాణం సంకలన ప్రారంభమైంది.
ఇతని ఆస్థానంలో ఆచార్య నాగార్జునుడు ఉండేవాడు.
యజ్ఞశ్రీ నాగార్జునిడి కొరకు శ్రీపర్వతం లేదా నాగార్జునకొండ పై మహావిహారం లేదా పారవాత విహారం నిర్మించాడు.
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్,ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలన్నింటినీ పాలించిన చివరి రాజు.
విజయశ్రీ శాతకర్ణి
ఇతను 28 వ రాజు
శ్రీపర్వతం దగ్గర విజయపురి పట్టణం ను నిర్మించాడు.
ఇతని తరువాత చంద్రసేనుడు / చంద్రశ్రీ పాలించాడు.
3వ పులోమావి
ఇతను 30వ లేదా చివరి రాజు
ఇతని సేనాధిపతి శ్రీమాంతమూలుడు
ఇతను బళ్లారిలో 'మ్యాకదోని' శాసనంను వేయించాడు.